ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడని నమ్మి వరసగా విఫలమవుతున్నా కూడా  రిషబ్ పంత్ కు అన్ని ఫార్మాట్ లలో మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ వచ్చింది టీమిండియా యాజమాన్యం.  అయితే ఎప్పుడో  ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు  ప్రతి మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదన్నట్లుగా అతని ప్రదర్శన ఉండడం తో  ఇప్పుడు  పంత్  భవిష్యత్ గందరగోళం లో పడింది.  దీనికి తోడు  అనూహ్యంగా  కీపర్ గా ఛాన్స్ దక్కించుకొని  అటు బ్యాటింగ్ లో ఇటు కీపింగ్ లో  కేఎల్ రాహుల్ అదరగొడుతుండడం తో  రాహుల్ కే  పర్మినెంట్  గా  కీపర్  స్థానాన్ని కట్టబెట్టాలని కోహ్లీ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో పంత్ ప్రస్తుతం దిక్కుతోచని  స్థితిలో వున్నాడు. 
 
తాజాగా  పంత్ న్యూజిలాండ్ పర్యటన కు వెళ్లిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాకూడా అతనికి  తుది జట్టులో స్థానం సంపాదించడం అంత ఈజీ అయ్యేలా లేదు. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా  రాహుల్ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ మ్యాచ్ విజయం లో కీలక పాత్ర పోషించాడు.ఇక మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ కు ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైయింది.  ఓ విలేకరి.. నువ్వు, పంత్ మళ్ళీ తుది జట్టులో స్థానం దక్కించుకొని  ఈ 20సిరీస్ లో ఆడడం చూస్తావా ? అని అడుగగా  దానికి  షాక్ తిన్న రాహుల్పంత్ ను టీం లోకి తీసుకోవడం  నా చేతుల్లో  ఉండదు అని సమాధానం ఇచ్చాడు.  
 
అయితే దీనిపై  సోషల్ మీడియా లో నెటిజన్లు తమ దైన స్టైల్లో  స్పందిస్తున్నారు.  కొందరేమో పంత్ కు ఇదే చివరి టూర్  అని కామెంట్లు పెడుతుండగా .. మరి కొందరు ఆప్రశ్న అడిగిన విలేకరి పై ఫైర్ అవుతున్నారు. రాహుల్ ఏమన్నా కెప్టెనా లేక కోచా  పంత్ టీంలో ఉంటాడో లేదో అతను ఎలా చెప్పగలడు  తెలివుందా లేదా, ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా అడుగుతావు అని ఆ రిపోర్టర్ కు చురకలు అంటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: