ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అద్భుతమైన జట్టుగా ఎదిగిన విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అన్ని  సిరీస్ లను  సొంతం చేసుకుంటుంది టీమిండియా. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ను చూస్తేనే ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. మ్యాచ్  ఏదైనా ప్రత్యర్థులు  ఎవరైనా మైదానం ఎక్కడైనా.. కోహ్లీ సేన దుమ్ము దులుపుతున్నది. ప్రత్యర్థులు అందరిని చిత్తుగా ఓడిస్తు వరుస  సిరీస్ లను  కైవసం చేసుకుంటుంది కోహ్లీ సేన. ప్రస్తుతం టీమిండియా జట్టు ఆట నెంబర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్  అన్నట్లుగా దూసుకుపోతుంది. ప్రతి ఒక ఆటగాడు తన సత్తా చాటుతూ... అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. 

 

 

 ఇప్పటికే ఆస్ట్రేలియాలో లాంటి  దృఢమైన జట్టును కూడా చిత్తు  చేసి   అదే పట్టుదలతో న్యూజిలాండ్ జట్టుతో కూడా వ సిరీస్లో ఆడి ద్వైపాక్షిక సిరీస్లో గెలుచుకోవడానికి సిద్ధమైపోయింది టీమిండియా. ఎప్పటికే  న్యూజిలాండ్ తో  జరిగిన మ్యాచ్లో... టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. బౌలింగ్లోనూ బ్యాటింగ్ లోను  రాణించి ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది. అయితే న్యూజిలాండ్తో జరిగే మొదటి  టి20 మ్యాచ్ లో  భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు స్థానం కల్పించలేదు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగే రెండో టీ20 మ్యాచ్లో కూడా తుది జట్టులో  పలు మార్పులు చేసింది యాజమాన్యం. 

 

 

 న్యూజిలాండ్తో జరిగే రెండు టీ-20 మ్యాచ్లో పలువురు ఆటగాళ్ళను  మార్చాలని టీమిండియా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శార్దూల్  ఠాకూర్ ని పక్కనపెట్టి అతని స్థానంలో నవదీప్ సైనిని  తుది జట్టులోకి తీసుకురానున్నట్లు సమాచారం. మరోసారి రిషబ్ పంత్, సంజు సాంసన్ లను  రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేయటం ఖాయం గా కనిపిస్తోంది. జట్టులో కీపర్గా బ్యాట్స్మెన్గా అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ కు బ్యాట్స్మెన్గా మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: