ఈఏడాది సెప్టెంబర్ లో తమ దేశం లో జరిగే  ఆసియా కప్ టోర్నీలో పాల్గొనడానికి  ఇండియా ,పాకిస్థాన్ రావాలని లేదంటే వచ్చే ఏడాది భారత్ లో జరిగే టీ 20 ప్రపంచ కప్ లో పాక్ పాల్గొనదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ పేర్కొన్నాడు. అలాగే బంగ్లాదేశ్ , పాక్ లో పర్యటిస్తే ఆసియా కప్ హక్కులను బదిలీ చేస్తామని  వచ్చిన వార్తలను కూడా కొట్టిపారేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాకు ఆతిథ్య హక్కులను ఇచ్చింది. మేం వాటిని ఎవరికి బదిలీ చేయమని  వసీం ఖాన్ స్పష్టం చేశాడు. 
 
ఇక దశాబ్దం క్రితం  పాక్ లో శ్రీలంక జట్టు  పై ఉగ్రదాడి జరగడం తో అప్పటినుండి  అక్కడ  ఏ దేశం కూడా  పర్యటించడానికి సాహసించలేదు. అయితే గత ఏడాది మళ్లీ  శ్రీలంక నే పాక్ లో  పర్యటించింది. ఇక ఇప్పుడు అతి కష్టం మీద  బంగ్లాదేశ్ కూడా అక్కడ పర్యటిస్తుంది. అందులో భాగంగా పాక్ తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో తలపడుతుంది. ఇప్పటికే  రెండు  మ్యాచ్ లు పూర్తికాగా ఆ రెండింట్లో ఓడి బంగ్లా సిరీస్ ను చేజార్చుకుంది. రేపు ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగనుంది. ఈటూర్ లో బంగ్లా, ఆతిథ్య జట్టు తో  రెండు టెస్టుల సిరీస్ కూడా ఆడాల్సి వుంది కానీ  భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్  కేవలం టీ 20 సిరీస్ కు మాత్రమే ఒప్పుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: