న్యూజిలాండ్ తో  జరిగిన  రెండో టీ20 లో  7వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన భారత్.. 5మ్యాచ్ ల  సిరీస్ లో 2-0 ఆధిక్యం లో  దూసుకెళ్లింది.  రెండో టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్  5వికెట్ల నష్టానికి  కేవలం 132పరుగులు చేసింది. పరుగుల వరద పారించాల్సిన పిచ్ పై  టీమిండియా బౌలింగ్ దాటికి  కివీస్ ఆపసోపాలు పడింది.  కివీస్ బ్యాట్స్ మెన్ లలో గప్తిల్ 33, సైఫర్ట్ 33*మాత్రమే చెప్పుకోదగ్గ  స్కోర్ చేశారు. 
 
అనంతరం 17.3ఓవర్లోనే  లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా ఘనవిజయం సాధించింది.  ఇక మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో  గెలుపు  లో కీలక పాత్ర పోషించిన  ఓపెనర్ కమ్ కీపర్  కేఎల్ రాహుల్.. రెండో మ్యాచ్ లో 57పరుగుల తో అజేయం గా నిలిచి మరోసారి టీం ను విజేతగా నిలబెట్టాడు. దాంతో  రాహుల్  కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  ప్రస్తుతం రాహుల్ అద్భుతమైన  ఫామ్ లో వున్నాడు. ఏ స్థానంలోనైనా  బ్యాటింగ్ చేస్తూ  తన విలువేంటో  చూపిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: