భారత్ జట్టు సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడు వివిఎస్  లక్ష్మణ్ . లక్ష్మణ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కోల్ కత్తా లో ఆస్ట్రేలియా పై భారత్ సాధించిన విజయమే . ఇన్నింగ్స్ పాలో ఆన్  ఆడుతూ భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది . అటువంటి లక్ష్మణ్ ... క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత వ్యాఖ్యాత గా అవతారం ఎత్తాడు . హిందీ నేర్చుకోవడానికి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఈ హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్  ఒక ఇంటర్వూ లో   వివరించారు .

 

హిందీలో వ్యాఖ్యాత గా మారడానికి ఎంతో శ్రమించానని , తన పిల్లలతో కలిసి ట్యూషన్ కు వెళ్లాలని చెప్పారు . హిందీ లో మెరుగవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నానని తెలిపారు . పని ఏదైనా దానిపై  ఇష్టం పెంచుకోవాలన్న ఈ దిగ్గజ క్రికెటర్ , ఇప్పడు తాను కామెంటరీ ని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు . హైదరాబాద్ లో పెరిగిన తాను హిందీ మాట్లాడగలనని చెప్పిన లక్ష్మణ్ , హైదరాబాద్ హిందీ , టీవీ వీక్షకులు వినాలనుకునే హిందీ వేర్వేరని తెలిపారు . అది నాకు చాల కష్టంగా అన్పించిందని ... అప్పుడు తన ముందు రెండే దారులున్నాయని అన్నారు . ఒకటి ఇష్టమైన దాన్ని వదులుకోవడం , రెండవది కష్టపడి నేర్చుకోవడమని చెప్పారు .

 

తాను రెండవ మార్గమే ఎంచుకున్నానని చెప్పారు . ఎందుకంటే హిందీ నేర్చుకుంటే తనకున్న క్రికెట్ జ్ఞానాన్ని , ఆలోచనలను యువ క్రికెటర్లతో పంచుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు . హిందీ నేర్చుకోవడానికి ఎంతో శ్రమించినట్లు చెప్పిన లక్ష్మణ్ , తన పిల్లలు హిందీ నేర్చుకోవడాని ట్యూషన్ వెళ్తుంటే వారితో కలిసి వెళ్లానని చెప్పారు . ఆరవ స్థానం లో బ్యాటింగ్ చేయడం తనకు అనుభవం లేకపోయినా, జట్టు కోసం దాన్ని ఒక సవాల్ గా తీసుకున్నానని లక్ష్మణ్ వెల్లడించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: