భారత్ బాడ్మింటన్ సంచలనం.. తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో ఎన్ని విజయాలు సాధించిందో లెక్కపెట్టలేం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలన విజయాలతో నెంబర్ 1 స్థానంలో ఉన్న పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి గొప్ప ప్లేయర్ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌కు ఆమె ఎంపికైంది. 

 

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రటించిన పద్మ అవార్డుల జాబితాలో సింధుకు చోటు దక్కింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పీవీ సింధు ప్రస్తుతం ఆనందంలో గాల్లో ఎగురుతుంది. రాయితీ పద్మ భూషణ్ అవార్డుపై పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు చేసింది అవి ఏంటి అంటే ? మీరే చుడండి.. 

 

పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. ''ప్రభుత్వం నాకు పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించిందనే వార్త తెలియగానే చాలా సంతోషించా. మహిళా సాధికారత, బ్యాడ్మింటన్‌కు లభించిన గుర్తింపు ఇది. టోక్యో ఒలింపిక్స్‌ ముందు ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు రావడం నాలో కొత్త స్ఫూర్తిని నింపింది. ఇలాంటి పురస్కారాలతో మరింత కష్టపడి పతకాలు నెగ్గాలనే తపన పెరుగుతుంది. ఇంతటి పెద్ద అవార్డుతో నన్ను గౌరవించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించడమే నా లక్ష్యం.'' అంటూ ఆమె ఆనందాన్ని అంత ఆమె ముఖంలో చూపించేశారు పీవీ సింధు. 

మరింత సమాచారం తెలుసుకోండి: