టీమిండియా తో జరిగిన రెండవ టి 20 మ్యాచ్ లో తామింకా 15 నుంచి 20 పరుగులు సాధించి ఉన్నా , మధ్యలో తమ బౌలర్లు రెండు వికెట్లు పడగొట్టిన మ్యాచ్ ఫలితం మరొక విధంగా ఉండేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు . తనతో పాటు మిగతా బ్యాట్స్ మెన్లు అందరూ  విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు . ఇక తమ బౌలర్లను కూడా తాను తప్పు పట్టడం లేదని చెప్పాడు . ఆరంభంలోనే రెండు ప్రధాన వికెట్లు నేలకూల్చిన , అదే ఒత్తిడిని కొనసాగించడం లో విఫలమయ్యామని  అన్నాడు .

 

తమ స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్ మెన్ల పై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారని విలియమ్సన్  అన్నాడు . దానికి తమ స్పిన్నర్లను తప్పు పెట్టాల్సిన పనిలేదని , టీమిండియా బ్యాట్స్ మెన్లు స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని తెలుసునని చెప్పాడు .  తమ తప్పులను సరిదిద్దుకుని  సిరీస్ లో పుంజుకునేందుకు ఇంకా తమకు అవకాశం ఉందని అన్నాడు . ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి , రెండవ టి 20 మ్యాచ్ లోను టీమిండియా విజయం సాధించిన విషయం తెల్సిందే . ఓపెనర్ కెఎల్ రాహుల్ నిలకడగా రాణించి జట్టు విజయం లో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు .

 

తొలిమ్యాచ్ లో అద్భుతంగా రాణించి ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ , ఈ మ్యాచ్ లోను తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు . టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థి జట్టును కేవలం 132 పరుగులకే కట్టడి చేశారు . ఈ విజయం తో టీమిండియా టి 20 సిరీస్ లో 2-0 ఆధిక్యం లోకి దూసుకువెళ్లింది . మరొక మ్యాచ్ గెలిస్తే చాలు సిరీస్ భారత్ వశం కానుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: