రెండు నెలల క్రితం వరకు  కనీసం ఒక్క ఫార్మాట్ లోనైనా  చోటు దక్కించుకుంటాడా అనే విమర్శలను ఎదుర్కొన్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఏ స్థానం లోనైనా  బ్యాటింగ్ చేస్తూ  నేను తప్ప వేరే ఆప్షన్ లేదని నిరూపిస్తున్నాడు టీమిండియా  ఓపెనర్ కమ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్  కేఎల్ రాహుల్. ఇన్నిరోజులు రాహుల్ ను కేవలం ఓపెనర్  గా చూసిన టీమిండియా అభిమానులు ఇటీవల ఆసీస్ తో జరిగిన సిరీస్ నుండి  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గాను కీపర్ గాను చూస్తున్నారు. ఓపెనింగ్ తోపాటు ఈ  రెండింట్లో నూ  అదరగొడుతుండడం తో వన్డేలు ,టీ 20ల్లో రాహుల్ నే పర్మినెంట్  కీపర్ గా కొనసాగించాలనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. కోహ్లీ కూడా అందుకు తగ్గట్లే రాహుల్ కు అవకాశాలు ఇస్తున్నాడు. 
 
ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ లో  రాహుల్ ఓపెనర్ గా వస్తూ వికెట్ల వెనుకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కాగా ఈ సిరీస్ లోకూడా తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో అర్ధ శతకం చేయగా  ఆదివారం జరిగిన  రెండో మ్యాచ్ లోనూ అజేయ అర్ద శతకంతో అదుర్స్ అనిపించాడు.  తద్వారా  వికెట్ కీపర్ గా  వరుసగా  రెండు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీ లు చేసిన మొదటి ఆటగాడి గా రాహుల్  టీ 20ల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు  ఈ రెండు హాఫ్ సెంచరీలతో  భారత్ తరపున  అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన  వికెట్ కీపర్ గా ధోని సరసన నిలిచాడు. ధోని కూడా టీ 20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు..  అయితే అవి వరుసగా చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: