టీమిండియా స్టార్ ప్లేయర్లు   విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాటికి  ఇప్పటికే చాలా  రికార్డులు  కనుమరుగయ్యాయి.  గత కొంత కాలంగా  ప్రపంచ క్రికెట్ లోని అరుదైన రికార్డులను కూడా  అవలీలగా బ్రేక్  చేస్తూ  వీరిద్దరూ జోరు కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు  కోహ్లీ , రోహిత్ ఓ సాధారణ రికార్డు పై కన్నేశారు.  టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మెన్  & బెస్ట్ ఫీల్డర్ సురేష్  రైనా  రికార్డు పై  వీరి కన్ను పడింది.   2006నుండి  2018 వరకు రైనా  టీమిండియా తరుపున  78టీ20 మ్యాచ్ లు ఆడగా మొత్తం 42క్యాచ్ లు పట్టాడు. తద్వారా టీ 20ల్లో  టీమిండియా తరుపున అత్యధిక క్యాచ్ లు పట్టిన ఫీల్డర్ గా రైనా రికార్డు సృష్టించాడు. 
 
 
అయితే ఇప్పుడు  ఈ రికార్డు ను బ్రేక్ చేయడానికి కోహ్లీ , రోహిత్ అడుగు దూరం లో వున్నారు. అందులో భాగంగా కోహ్లీ 41 క్యాచ్ లు పట్టగా  రోహిత్ 40క్యాచ్ లు అందుకున్నాడు.  దాంతో  బుధవారం హామిల్టన్  లో న్యూజిలాండ్ తో జరుగనున్న మ్యాచ్ లో  కోహ్లీ  , రోహిత్ కు  ఈ రికార్డు  బ్రేక్ చేయడానికి ఛాన్స్ దొరికింది.  ఒకవేళ ఆ  మ్యాచ్ మిస్ అయినా  ఈ సిరీస్ లో  మరో రెండు మ్యాచ్ లు ఉంటాయి కాబట్టి  ఎలాగైనా  రైనా రికార్డు ను ఈఇద్దరి లో ఎవరో ఒకరో బ్రేక్ చేయడం ఖాయం.  ఇక రైనా విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా  టీంలో  స్థానం దక్కించుకోలేకపోతున్న  ఈ 33ఏళ్ళ  ఆటగాడు ఎలాగైనా  ఈఏడాది జరుగనున్న టీ 20 ప్రపంచ కప్ లో చోటు కోసం కఠినంగా శ్రమిస్తున్నాడు. అయితే ప్రస్తుతం యువ ఆటగాళ్లతో పోటీ  ఎక్కువగా వున్నందున రైనా మళ్ళీ  జట్టులో కి రావడం దాదాపు అసాధ్యమే అయ్యేలా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: