ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్ ) మ్యాచుల్లో ఎటువంటి మార్పులు లేవని , రాత్రి ఎనిమిది గంటలకే మ్యాచ్ లు స్టార్ట్ అవుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు . కొన్నాళ్ల నుంచి ఐపీల్ మ్యాచ్ లు రాత్రి ఏడు గంటలకే స్టార్ట్ అవుతాయని , ఈ మేరకు టీవీ ప్రసార దారులు,  బీసీసీఐ పై ఒత్తిడి చేస్తున్నారన్న ఊహాగానాలు విన్పించాయి . అయితే ఈ ప్రతిపాదనను ఐపీల్ ప్రాంచైజీలన్నీ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది .

 

దానితో గత ఐపీల్ సీజన్ల మాదిరిగానే , ఈసారి కూడా రాత్రి ఎనిమిది గంటలకే మ్యాచ్ లను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది . ఇక తొలిసారిగా కంక షన్ సబ్ స్టిస్ట్యూట్ ప్రవేశపెడుతున్నామని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు . ఇక తొలిసారిగా నోబాల్ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ కాకుండా , థర్డ్ అంపైర్ తీసుకోనున్నాడని  తెలిపాడు . మే 24 న  ఐపీల్ ఫైనల్ మ్యాచ్ ముంబయి లో జరగనుందని చెప్పాడు . కానీ ఈసారి ఒకే రోజు రెండు ఐపీల్ మ్యాచ్ ల నిర్వహణ ను తగ్గించినట్లు తెలిపాడు .

 

కేవలం ఐదు రోజులు మాత్రమే రెండు మ్యాచ్ లను మాత్రమే సాయంత్రం నాలుగు , రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు గంగూలీ వెల్లడించాడు . సీజన్ ఆరంభానికి ముందు ఆల్ స్టార్స్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపాడు . లీగ్ ఆరంభానికి మూడు రోజుల ముందు ఆల్ స్టార్ మ్యాచ్ ఉంటుందని , వేదిక ఎక్కడ అన్నది నిర్ణయించలేదని గంగూలీ చెప్పాడు .

 

మ్యాచ్ నిర్వహణ కు ఆహ్మదాబాద్ వేదిక సిద్ధం కాలేదు ...  కాబట్టి అక్కడ మ్యాచ్ నిర్వహించే అవకాశం లేదని అన్నాడు . ఇక విరాళాల సేకరణ ప్రక్రియను సరైన వారికి  అప్పగిస్తామని చెప్పాడు . ఇక నేషనల్ క్రికెట్ అకాడమీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు గంగూలీ తెలిపాడు . 

మరింత సమాచారం తెలుసుకోండి: