తాజాగా  బంగ్లాదేశ్‌ లో జరిగిన ఓ  దేశవాళీ మ్యాచ్‌లో  ఏకంగా 48 సిక్సర్లు, 70 ఫోర్లతో  బ్యాట్స్ మెన్లు పరుగుల వరద పారించారు.   ఢాకా సెకండ్ డివిజన్‌లో నార్త్‌ బెంగాల్‌ క్రికెట్ అకాడమీ , టాలెంట్ హంట్‌ అకాడమీ మధ్య జరిగిన మ్యాచ్ లో  ఇరుజట్లబ్యాట్స్ మెన్లు  రెచ్చిపోవడంతో ఏకంగా  818పరుగులు నమోదయ్యాయి.  తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్‌ బెంగాల్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 432 పరుగులుచేయగా  అనంతరం బరిలోకి దిగిన టాలెంట్‌ హంట్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసి ఓటమిపాలైంది.   ఈ మ్యాచ్‌లో నార్త్‌ బెంగాల్ బ్యాట్స్‌మెన్‌ 27 సిక్సర్లు  కొట్టగా  టాలెంట్‌ హంట్‌ బ్యాట్స్‌మెన్‌ 21 సిక్సర్లు బాదారు. 
 

కాగా  బంగ్లాదేశ్‌ దేశవాళీ మ్యాచ్‌ల్లో  ఇలా జరగడం  కొత్తేమి కాదు.  గతంలో కూడా  ఈలాంటి అసాధారణ ప్రదర్శనలు నమోదయ్యాయి. మాములుగా  నే బంగ్లా డొమెస్టిక్ క్రికెట్ లో  మ్యాచ్‌ ఫిక్సింగ్, అవినీతిఎక్కువగా జరుగుతుంటుంది. 2017లో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసిన ఓ బౌలర్‌ను పదేళ్లు నిషేధించారు.  కావలనే  అతను వైడ్లు , నో బాల్స్  వేసి ఏకంగా 92 పరుగులు ఇచ్చాడు.  దాంతో తాజాగా జరిగిన మ్యాచ్ పై ఎంక్వేరి జరుగనుందని  బంగ్లా క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: