ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. సొంతగడ్డపై సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మట్టికరిపించిన భారత్.. ఇప్పుడు రచ్చ గెలవడానికి రెడీ అయింది. ఫస్ట్ టైమ్ కివీస్‌ గడ్డపై సిరీస్‌పై కన్నేసింది కోహ్లీసేన. రెండు టీ-20 ల్లో సూపర్‌ విక్టరీ కొట్టిన టీమిండియా మూడో టీ-20కి సై అంటోంది. బుధవారం హామిల్టన్‌లో మూడో టీ-20 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయ్ టీమిండియా, న్యూజిలాండ్. 

 

ఐదు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు టీ20ల్లోనూ గెలుపొందిన భారత్ జట్టు ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో టీ20లోనూ గెలిచి న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ని కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై కనీసం మూడో టీ20లోనైనా గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని కివీస్ కూడా ఆశిస్తోంది. దీంతో.. ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.

 

రెండు మ్యాచ్‌లను ఓవరాల్‌గా చూస్తే  రోహిత్ శర్మ తో పాటు శార్దూల్ ఠాకూర్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. కివీస్‌ గడ్డపై హిట్‌మ్యాన్ రికార్డు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. న్యూజిలాండ్‌లో రోహిత్ శర్మ పేలవ రికార్డు ఈ సిరీస్‌లోనూ కంటిన్యూ అవుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా రాణించి తిరిగి బ్యాటింగ్‌లో జోరందుకోవాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ అదరగొట్టాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ రెండు హాఫ్ సెంచరీలతో టీమిండియా గెలుపు సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని రాహుల్ భావిస్తున్నాడు. కోహ్లీ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.  బౌలింగ్‌ విభాగంలో శార్దూల్‌ ఠాకూర్‌ అంచనాలను అందుకోలేదు. షమీ రెండో టీ-20లో చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్నాడు. బుమ్రా పదునైన బౌనర్లు, యార్కర్లతో ఆకట్టుకున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో జడేజా, చాహల్ ఫర్వాలేదనిపించారు. వీరందరూ రాణిస్తే మూడో మ్యాచ్‌లోనూ టీమిండియాకు తిరుగుండదు.

 

మరోవైపు వన్డే వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ అన్ని ఫార్మాట్లలో తడబడుతోంది. ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నాయ్‌. బౌల్డ్, ఫెర్గూసన్ వంటి బౌలర్లు దూరమవ్వడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి టీ20లో 200 పైచిలుకు చేసినా కాపాడుకోలేకపోయింది.రెండో టీ-20 లో కివీస్ బ్యాట్స్‌మెన్ ఫెయిలయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో సత్తా చాటి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని కివీస్ భావిస్తోంది. విలియమ్సన్, గప్టిల్, టేలర్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్ పటిష్టంగా ఉంది. ఇక బౌలర్లు రెండు మ్యాచ్‌ల్లోనూ  దీంతో బౌలింగ్‌లో సత్తా చాటి.. టీమిండియాను కట్టడి చేయాలని కివీస్‌ భావిస్తోంది. గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా హాట్ ఫేవరేట్ అయినప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచానా వేయలేం. అటు హామిల్టిన్ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: