భారతదేశంలో అన్ని ఆటల కంటే ఎక్కువగా పాపులర్ అయ్యి  ఎక్కువ మంది అభిమానులను ఆకర్షించిన ఆట క్రికెట్. భారత్లో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదు అనడంలో సందేహమే లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే కళ్లార్పకుండా టీవీల ముందు కూర్చుని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు. ఏకంగా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కి ఇన్వాల్వ్ అయిపోయి టీవీ ముందు కూర్చుని  మైదానంలో ఆడుతున్న ఆటగాళ్ళకు  అలా ఆడు ఇలా అంటూ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఆడియన్స్. క్రికెట్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంతో ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ మ్యాచ్  వస్తుందంటే చాలు పని మానుకుని టీవీల ముందు వాలిపోతారు. మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 

 

 

 అయితే క్రికెట్ అన్నాక రికార్డులు  బద్దలు కొట్టడం కామన్ గా  జరుగుతూ ఉంటుంది. కొంత మంది ఆటగాళ్లు సరికొత్త రికార్డు సృష్టిస్తే ఇంకొంతమంది ఆటగాళ్ళు.. ఇతర ఆటగాళ్ల రికార్డులను తిరగ రాస్తూ ఉంటారు. ఇలా రికార్డులు బద్దలు కొట్టడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు క్రికెట్లో ఆటగాళ్ళు. ఇక కొంత మంది ఆటగాళ్లు అయితే వారు అరంగేట్రం  చేస్తున్న మ్యాచ్లోనే అదరగొట్టి తన సత్తా చాటి సరికొత్త రికార్డు నెలకొల్పుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు ఇలా రికార్డు నెలకొల్పిన వారు ఉన్నారు. 

 

 

 ఇక తాజాగా మరో యువ ఆటగాడు ఇలాంటి సంచలన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే అద్భుత రికార్డు సాధించాడు మధ్యప్రదేశ్ కి చెందిన యువ  క్రికెటర్ రవి యాదవ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన మొదటి మ్యాచ్లోనే ఈ రికార్డు నెలకొల్పడం గమనార్హం. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్ తో  జరిగిన మ్యాచ్ లో ... ఆర్యన్ జుయల్, అంకిత్ రాజ్ పుత్, అరవింద్ రిజివిలను పెవిలియన్ చేర్చాడు ఈ ఆటగాడు. తొలి ఇన్నింగ్సులో 16 ఓవర్లు వేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: