అండర్  19 ప్రపంచ కప్ లో భాగంగా  మంగళవారం జరిగిన  ఫ్రీ క్వార్టర్ ఫైనల్  మ్యాచ్ లో  ఆస్ట్రేలియా అండర్ 19జట్టు పై  టీమిండియా అండర్ 19జట్టు 74 పరుగుల తో ఘనవిజయం సాధించింది. దాంతో  ఈ మెగా టోర్నీ లో సెమిస్ ఫైనల్స్  లో కి  ప్రవేశించి యువ భారత జట్టు  అదుర్స్ అనిపించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన  టీమిండియా  నిర్ణీత  50ఓవర్లలో  9వికెట్లనష్టానికి 233 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (62),అంకోలేకర్ (55),రవి బిష్ణోయ్ (30) రాణించారు. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన  ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.  భారత్ బౌలర్ల లో కార్తీక్ త్యాగి 4, ఆకాష్ సింగ్ 3వికెట్లు పడగొట్టగా రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశాడు.  8ఓవర్ల లో 24పరుగులు ఇచ్చి 4కీలక వికెట్లు తీసిన యువ ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగి కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక  డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ టోర్నీ లో బరిలోకి దిగిన టీమిండియా అండర్ 19జట్టు ఇప్పటివరకు ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: