ప్రముఖ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ ఈరోజు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆమె సోదరి చంద్రాన్షు బీజేపీలో చేరారు. బ్యాడ్మింటన్ లో ఎంతో ప్రతిభ కనబరిచి ఎన్నో పథకాలను సాధించిన సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కోర్టు నుండి నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు. క్రీడాప్రపంచంలోనే సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారనే వార్తలు సంచలనం రేపాయి. 
 
బీజేపీ పార్టీలో చేరిన తరువాత సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను నిరంతరం కష్టపడి పని చేసే వ్యక్తినని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రధాని మోదీతో తాను కలిసి పని చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అకస్మాత్తుగా సైనా బీజేపీలో చేరటానికి ఢిల్లీ ఎన్నికలే కారణమని సమాచారం. 
 
ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేయడానికే బీజేపీ ప్రముఖ నేతలు సైనా నెహ్వాల్ ను పార్టీలోకి ఆహ్వానించారని సైనాకు కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉండటంతో బీజేపీ పార్టీలో చేరారని సమాచారం. ప్రధాని మోదీని గతంలో అనేక సందర్భాల్లో సైనా నెహ్వాల్ కలిశారు. అర్జున అవార్డును, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కూడా సైనా సొంతం చేసుకున్నారు. సైనా 24 అంతర్జాతీయ టైటిళ్లను గెలుపొందారు. సైనా బీజేపీలో చేరడంతో బ్యాడ్మింటన్ నుండి తప్పుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: