బుధవారం న్యూజిలాండ్ , ఇండియా మధ్య జరిగిన మూడో టీ 20 క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. 5మ్యాచ్ ల టీ 20సిరీస్ లో భాగంగా  మొదటి రెండు మ్యాచ్ లు ఏకపక్షంగా జరుగగా మూడో  మ్యాచ్ మాత్రం నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 179పరుగులు చేసింది. 
 
గత రెండు మ్యాచ్ ల్లో నిరాశ పరిచిన రోహిత్ ..మళ్ళీ ఫామ్ ను అందుకొని బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు.  కేవలం 23బంతుల్లోనే అతను  హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ దూకుడు చూస్తే టీమిండియా స్కోర్ 200దాటేలా అనిపించింది. అయితే సగం ఓవర్లు  పూర్తయ్యాక  సీన్ రివర్స్ అయ్యింది. క్రమం తప్పకుండా  వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ నెమ్మదించింది . రోహిత్ కు తోడు కోహ్లీ రాణించడం తో  కివీస్ ముందు టీమిండియా సులభతరం కానీ లక్ష్యాన్నే ఉంచింది. 
 
ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ కూడా 20ఓవర్లలో 179పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ ను నిర్వహించగా  రోహిత్ మరోసారి మెరుపులు మెరిపించడం తో  టీమిండియా విజయం సాధించింది. గెలుపు లో కీలక పాత్ర పోషించిన వైస్ కెప్టెన్  రోహిత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈమ్యాచ్ ద్వారా  రోహిత్  అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా 10000పరుగులు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: