టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఈ ఆటగాని  గురించి ఎంత చెప్పినా తక్కువే. రికార్డుల రారాజు... పరుగుల యంత్రం.. సక్సెస్ఫుల్ కెప్టెన్.. ఇలా విరాట్ కోహ్లీ కి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. విరాట్ కోహ్లీ భారత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాక.. భారత జట్టును మలిచిన తీరు అసామాన్యం. భారత జట్టు ని ముందుండి నడిపిస్తున్న తీరు మహా అద్భుతం. జట్టు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తునే... తనదైన స్టైల్ లో అద్భుత ప్రదర్శనతో అందరిని ఉర్రూతలూగిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఓ వైపు తను సొంతంగా ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూనే...జట్టుని  ముందుండి నడిపించి  విజయం సాధించి మరెన్నో రికార్డులను తిరగరాస్తున్నాడు. 

 


 ఇప్పటికే ఎంతో మంది దిగ్గజ క్యాప్టెన్ లకు సాధ్యమైన రికార్డులను తిరగరాసి తన పేరును లిఖించుకున్నాడు ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తక్కువ కాలంలోనే ఎన్నో రికార్డులను సైతం అధిగమించాడు. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా మునుపెన్నడూ లేని విధంగా ఎంతో బలంగా తయారయింది. భారత జట్టును చూస్తేనే ప్రత్యర్థి జట్టులన్ని వణికి పోయే లా ప్రస్తుతం టీమిండియా పటిష్టంగా ఉంది. బౌలింగ్ బ్యాటింగ్ ఏదైతేనేమి.. సరిలేరు మీకెవ్వరు అని నిరూపిస్తున్నారు భారత ఆటగాళ్లు. 

 


 తాజాగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా మరో సంచలన రికార్డు సృష్టించాడు. ఇప్పటికే న్యూజిలాండ్తో ఐదు టి20 ల సిరీస్ భారత్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించి వరుసగా మూడు టి-20లలో  విజయం సాధించి3-0 తో  సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా  కివీస్ గడ్డపై ఇండియాకు ఇదే టి20 సిరీస్ కావడం గమనార్హం. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై తొలి టి20 సిరీస్ నెగ్గిన మొదటి భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇక నిన్న జరిగిన మ్యాచ్  ఎంతో ఉత్కంఠగా మారగా.. సూపర్ లో టీమ్ ఇండియా  విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: