ఓటమి లేని టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. నెవర్ బిఫోర్ నెవెర్  ఆఫ్టర్ అన్నట్లుగా టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టు ఎంతో పటిష్టంగా తయారయింది. ప్రత్యర్థి జట్టు ఎవరైనా చిత్తుగా ఓడించేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ గడ్డపై టి20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి వుండగానే కైవసం చేసుకుంది టీమిండియా. న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన మూడవ t20 మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠగా సాగగా  సూపర్ ఓవర్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇప్పటికే విజయోత్సాహంలో ఉన్న టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్ లలో  కూడా గెలిచి క్లీన్స్వీప్ చేయాలని ప్రయత్నిస్తోంది. 

 

 

 అయితే న్యూజిలాండ్తో జరిగే నాలుగో టీ20 మ్యాచ్లో జట్టు లో పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో అవకాశం దక్కని  ఆటగాళ్లను నాలుగో మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం  ఈ అంశం ఆసక్తికరంగా మారింది. అయితే రిషబ్ పంత్సంజు శాంసన్నవదీప్ సైని,  వాషింగ్టన్ సుందర్కుల్దీప్ యాదవులకు ఈ పర్యటనలో ఇంకా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో నాలుగు మ్యాచ్ల్లో కాసిన్ని  ప్రయోగాలు చేసి ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన వారిని మ్యాచ్లో ఆడించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది నుంచి విశ్రాంతి లేకుండా బౌలింగ్ చేస్తున్న షమీకి  విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. షమీ  స్తానం లో నవదీప్ సైని, చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, జడేజాకు బదులుగా వాషింగ్టన్ సుందర్ లను తుది జట్టులో ఆడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎవరిని తప్పించే అవకాశం లేకపోవడంతో రిషబ్ పంత్ సంజు శాంసన్ లకు తుది జట్టులో ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇకపోతే శివం దూబే, పాండే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పు చేసి వారిని కాస్త ముందుగా బ్యాటింగ్కు పంపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు మ్యాచ్లు ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు కనీసం నాలుగు మ్యాచ్లోనైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. 4 మ్యాచ్ లో గెలిచిన ఎలాంటి ఉపయోగం లేకపోయినప్పటికీ కనీసం పరువును కాపాడుకోవాలంటే గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది న్యూజిలాండ్ జట్టుకు.

మరింత సమాచారం తెలుసుకోండి: