సంజూ శాంసన్... ఈ ఆటగాడికి వచ్చేవే అవకాశాలు అంతంత మాత్రం... మరి వచ్చిన అవకాశమైనా సరిగ్గా సద్వినియోగం చేసు కుంటాడ అంటే అదీ లేదు. లేక లేక మొన్న శ్రీలంక సిరీస్లో భాగంగా చివరి టీ20 మ్యాచ్లో సంజు శాంసన్ ఆడేందుకు అవకాశం దొరికినప్పటికీ.. సంజు శాంసన్ అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయాడు. బ్యాటింగ్ కు  దిగగానే మొదటి బంతిని సిక్సర్ గా మరిచి..రెండో  బంతికి బౌలర్ కి  దొరికిపోయి  వికెట్ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో సంజు శాంసన్ ను  నమ్మి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు సంజు సాంసంన్  కు మరోసారి అవకాశం వచ్చింది. 

 


 న్యూజిలాండ్తో ఇప్పటికే మూడు టి20 మ్యాచ్ లు  గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.  అయినప్పటికీ క్లిన్ స్వీప్  చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది టీమిండియా. ఇకపోతే 4 టి20 మ్యాచ్ లో  టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కు బదులుగా సంజు శాంసన్ కు తుది జట్టులో స్థానం దక్కింది. కాగా సంజు శాంసన్ ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన చేయనప్పటికీ అవకాశం వచ్చింది. కాగా  ఈ అవకాశాన్ని కూడా సంజు శాంసన్ ఉపయోగించుకోలేక పోయాడు.తన  ఆట తీరును ఇంకా మార్చుకోలేదు. దీంతో టీమిండియా యాజమాన్యానికి సంజు శాంసన్ ఆటతో మరోసారి నిరాశే ఎదురైంది. 

 

 

 నేటి మ్యాచ్ లో  ముందుగా టీమిండియా బ్యాటింగ్ కు  దిగడంతో... రోహిత్ శర్మ ప్లేస్ లో  ఓపెనర్ గా వచ్చిన సంజు  సాంసన్... 5 బంతులు ఆడి 8 పరుగుల వద్ద తొలి వికెట్ గా నిష్క్రమించాడు. న్యూజిలాండ్ బౌలర్ కూల్ గీన్  వేసిన 2 ఓవర్ మొదటి బంతి సిక్స్ కొట్టిన సంజు శాంసన్ రెండో బంతికి ఎలాంటి పరుగు తీయలేదు. మూడు బంతికి మరో భారీ షాట్ ఆడే  ప్రయత్నంలో  క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మ్యాచ్  ప్రారంభమైన కొద్ది సేపటి వరకు మైదానంలో కుదుర్చుకునేందుకు ప్రయత్నించకుండా  మొదటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు అత్యుత్సాహం చూపడంతో సంజు శాంసన్ కవికెట్  కోల్పోవాల్సి వచ్చింది. సంజు  సాంసన్ దుందుడుకు స్వభావం తో ఈ అవకాశాన్ని కూడా వాడుకో లేకపోయాడు. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: