వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ , భారత్ ల మధ్య  జరుగుతున్న నాలుగో టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్..  న్యూజిలాండ్ కు 166పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బదులుగా  న్యూజిలాండ్  కూడా దీటుగా జవాబిస్తుంది.  ప్రస్తుతం  ఆజట్టు 16 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి130పరుగులు చేసింది  చేసింది. అయితే ఈ మ్యాచ్ లో  కెప్టెన్ విలియమ్సన్ లేకపోవడంతో వీలైనంత తొందరగా మరో రెండు వికెట్లు తీస్తే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్లే.. 
 
ఇక ఈమ్యాచ్ లో  టాస్ ఓడిపోయి  బ్యాటింగ్ కు దిగిన  భారత్ కు  శుభారంభం దక్కలేదు. రోహిత్ స్థానం లో ఓపెనర్ గా  అవకాశం దక్కించుకున్న  సంజు సాంసన్ నిరాశ పరిచాడు. కేవలం8పరుగులే చేసి  రెండో ఓవర్ లోనే వెనుదిరగగా ఆతరువాత కోహ్లీ,  శ్రేయస్ అయ్యర్ లు కూడా తొందరగానే  పెవిలియన్ చేరుకున్నారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ కు తన ఫామ్ ను కొనసాగిస్తూ స్కోర్ బోర్డు ను  పరుగులు పెట్టించాడు. అయితే ఈ దశలో రాహుల్ కు అండగా వుంటాడనుకున్న శివమ్ దూబే  మరో సారి  నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ తరువాత కాసేపటికే  రాహుల్ , సుందర్ కూడా  వెనుదిరగడం తో భారత్ కష్టాల్లో పడింది.  అయితే ఈ దశలో శార్దూల్ ఠాకూర్ తో కలిసి   మనీష్ పాండే ఇన్నింగ్స్ ను నిర్మించాడు. వేగంగా ఆడే క్రమంలో  శార్దూల్ వెనుదిరిగినా  చివరి వరకు అజేయంగా నిలిచి  హాఫ్ సెంచరీ తో మనీష్ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ ను అందించాడు. భారత బ్యాట్స్ మెన్ లలో  మనీష్ 50*,కేఎల్ రాహుల్ 39, శార్దూల్ 20పరుగులతో రాణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: