న్యూజిలాండ్ లో జరుగుతున్న టీ - 20 సిరీస్‌ ని సొంతం చేసుకున్న టీమిండియా నేడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ - 20లో ప్రయోగాలకి వెళ్లి భారీ మూల్యన్నే చెల్లించుకుంది అని చెప్పవచ్చు. ఇండియా టీంలో సంజు శాంసన్ (8), కెప్టెన్ విరాట్ కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (1) ఫెయిల్ అవ్వగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌ మెన్ మనీశ్ పాండే 50 పగలు, 36 బంతుల్లో నాటౌట్ గా( 3x4) తన  బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాచ్‌ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణిత ఇరవై ఓవర్లకి 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులు  26 బంతుల్లో (3x4, 2x6) తను కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.

 

మొత్తానికి ఐదు టీ - 20 ల సిరీస్‌ లో భారత్ 3-0 తో ముందంజలో నిలిచిన నేపథ్యంలో నేడు నాలుగో టీ - 20కి భారత్ జట్టులో కెప్టెన్ కోహ్లీ మూడు మార్పులు చేసి వారిని ఆడించాడు. జట్టులోని  ఓపెనర్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ షమీ, స్పిన్నర్ జడేజాలకి రెస్ట్ ని ఇచ్చి వారికీ బదులు సంజు శాంసన్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకొచ్చి ఆడనిచ్చాడు. కానీ ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 8 పరుగులకే రెండో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే (12), వాషింగ్టన్ సుందర్ (0) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేక పోయారు. దీనితో 11.3 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ కేవలం 88/6తో కష్టాల్లో పడి పోయింది.

 

ఈ పరిస్థితులలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ కి వచ్చిన మనీశ్ పాండే జట్టు స్కోరు బోర్డుని నడిపించే బాధ్యతని తానే తీసుకున్నాడు. అతనికి శార్ధూల్ ఠాకూర్ 20 పరుగులు 15 బంతుల్లో (2x4) నుంచి మంచి సహకారం అతనికి లభించింది. వారు ఆడుతున్నప్పుడు గతి తప్పిన బంతుల్ని మాత్రమే బౌండరీకి తరలిస్తూ మ్యాచ్ లో నిలకడగా ఆడిన ఈ జోడి భారత్‌ కి మెరుగైన స్కోరుని అందించి పరువు నిలిపింది. ఆఖర్లో నవదీప్ సైనీ 11 పరుగులు నాటౌట్, 9 బంతుల్లో (2x4) స్కోర్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: