న్యూజిలాండ్ ని మరోసారి సూపర్ ఓవర్ కొంప ముంచింది. సిరీస్ మూడో మ్యాచ్ లో లాగే నేటి నాలుగో మ్యాచ్ లో కూడా స్కోర్స్ సమానం అవ్వడంతో చివరికి సూపర్ ఓవర్ కి దారి తీసింది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణిత ఇరవై ఓవర్లకు కాను ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష చేధనకు దిగిన  న్యూజిలాండ్ మొదట్లో వికెట్ పడి పోయిన తరవాత కోలుకొని టార్గెట్ వైపు సునాయాసగా పయనించింది.


మ్యాచ్ కీలక చివరి ఓవర్స్ లో  భారత బౌలర్లు కోలుకొని బాగా కట్టడి చేయగా న్యూజిలాండ్ కూడా కరెక్ట్ గా ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో శార్దూల ఠాకూర్ వేసిన చివరి ఓవర్ ఒక కీలకమైన ఓవర్ అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆ ఓవర్ లో మూడు వికెట్లు తాను సాధించాడు. దీనితో మళ్ళి మ్యాచ్ సూపర్ ఓవర్ కి దరి తీసింది. ఇందులో౦ మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓవర్ లో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేయగలిగింది. 

 

తర్వాత 14 పరుగుల లక్షాన్ని ఛేదనలో లోకేష్ రాహుల్ మొదటి బాల్ ని సిక్స్ గ్గా మలిచి, మరుసటి బాల్ ని బౌండరీకి తరలించాడు. దీనితో భారత్ కి 4 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ స్థిత్లో భారీ షాట్ ఆడబోయి మూడో బాల్ కి రాహుల్ అవుట్ అవ్వగా మిగితా లాంఛనాన్ని కింగ్ కోహ్లీ తన స్టైల్ లో ముగించాడు. దీనితో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 4 - 0 తో ముందంజలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: