నేడు కివీస్ తో పోరాడిన టీమిండియా సూపర్ ఓవర్ తో విజయం సాధించిన విషయం తెలిసిందే. వెల్లింగ్టన్ వేదికగా కివీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సూపర్ ఓవర్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టి భారత్ కు మరో విజయాన్ని తీసుకొచ్చాడు. 

 

ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాన్నీ వెల్లడించాడు.. అది ఏంటి అంటే.. కోహ్లీ మాట్లాడుతూ.. '' వరుసగా రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత తానో ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నట్టు చెప్పాడు'' ఆ ముఖ్యమైన పాఠం ఏంటి అంటే..? ''మ్యాచ్ చివరి వరకు నిబ్బరంగా ఉండాలని.. ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత చెలరేగిపోవాలనే విషయాన్ని నేర్చుకున్నానని'' కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

 

కాగా 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ విజయం సాధించింది.. అటు వైపే పరుగులు వేస్తుంది అనుకున్న సమయంలో చివరి రెండు ఓవర్లలో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. అయితే, హామిల్టన్ మ్యాచ్‌లానే కివీస్ ఒత్తిడికి గురై వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుని సూపర్ ఓవర్ కు దారి తీసేలా చేసుకున్నారు. దీంతో ఆ సూపర్ ఓవర్ కాస్త భారత్ కు మరో విజయాన్ని సొంతం చేసింది. ఈ విషయంపైనే విరాట్ కోహ్లీ మాట్లాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: