బీబీసీఐ కెట్ సలహా కమిటీ (సీఏసీ) ని ముగ్గురు మాజీ క్రికెటర్లతో తాజాగా నియమించింది. మదన్ లాల్, సులక్ష‌ణా నాయ‌క్‌, రుద్ర‌ప్ర‌తాప్ సింగ్‌ ల‌ను సీఏసీలోకి నియమించింది. వీరి ప‌ద‌వీకాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. సీనియ‌ర్ సెలెక్ష‌న్ క‌మిటీని త్వరలోనే వీరు భర్తీ చేయనున్నారు. భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్‌ తో కూడిన సినీయర్ సెలెక్ష‌న్ కమిటీ ప‌ద‌వీకాలం అయిపోయిన సంగతి తెలిసిందే.

 

1983 సంవత్సరంలో ప్ర‌పంచ‌క‌ప్‌ ను గెలిచిన భార‌త జ‌ట్టులో మ‌ద‌న్ లాల్ ఇందులో ఒక స‌భ్యుడు. త‌న కెరీర్‌ లో 39 టెస్టులు, 67 వన్డేలు అయన ఆడాడు. రెండు ఫార్మాట్ల‌లో క‌లిపి 1443 ప‌రుగులు చేయడంతో పాటు మొత్తం 144 వికెట్లు తీశాడు. ఇంతకముందు భార‌త కోచ్‌గా ప‌నిచేయ‌డంతో పాటు జాతీయ సెలెక్ట‌ర్‌గా కూడా అయన వ్య‌వ‌హ‌రించాడు. ఆర్పీ సింగ్ త‌న కెరీర్‌ లో 14 టెస్టులు, 58 వ‌న్డేలు, 10 టీ - 20లు ఆడాడు. ఎడ‌మ‌ చేతివాటం కలిగిన పేస‌రైన ఆర్పీ సింగ్‌ 2007 టీ - 20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన భారత జ‌ట్టులోని స‌భ్యుడు.

 

 

అలాగే మ‌హిళా క్రికెట్లో 11 ఏళ్ల పాటు ఆడిన సుల‌క్ష‌ణ 2 టెస్టులు, 46 వ‌న్డేలు, 31 టీ - 20లలో భార‌త్‌ కు ప్రాతినిథ్యం వ‌హించింది. త్వరలోనే సీఏసీ స‌భ్యులు సెలెక్ష‌న్ క‌మిటీ కోసం ఇంట‌ర్వ్యూలు వారు నిర్వ‌హించ‌నున్నారు. గ‌తంలో కొంతమంది సీఏసీ మెంబ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించిన క‌పిల్‌ దేవ్‌, అన్షుమ‌న్ గైక్వాడ్‌, శాంతా రంగ‌స్వామి ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల అంశంలో ఆరపణలు రావడంతో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విషయం అందరికి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: