ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ లో సంచలన ప్రదర్శనలతో అదరగొట్టిన ఆస్ట్రియా ఆటగాడు డొమెనిక్‌ థీమ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ లోకి ప్రవేశించాడు. శుక్రవారం నాడు జరిగిన పురుషుల రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ లో థీమ్‌ 3-6, 6-4, 7-6 (7/3), 7-6 (7/4) తో ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను చిత్తుగా ఓడించాడు. దీనితో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా డొమెనిక్‌ థీమ్‌ నిలిచాడు. ఓవరాల్‌ గా అతనికి ఇది మూడో గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఫైనల్‌.

 

 

ఆదివారం నాడు జరిగే టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ తో థీమ్‌ పోటీకి సన్నద్ధమయ్యాడు. క్వార్టర్స్‌ లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు రఫెల్ నాదల్‌ ని థీమ్‌ మట్టికరిపించిన విషయం అందరికి తెలిసిందే. అలాగే 2018, 2019 లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరి నాదల్‌ చేతిలో ఓడిపోయాడు.

 

 

సెమిస్ లో జరిగిన మ్యాచ్ మొత్తం 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరును థీమ్‌ తడబడుతూ ప్రారంభించాడు. తొలి సెట్‌ లో థీమ్‌ సర్వీస్‌ లను మూడుసార్లు బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌ జోరు కనబరిచి సెట్ ని కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌ లో థీమ్‌ పుంజుకొని బలమైన ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో చివరి వరకు తన జోరు కొనసాగించి సెట్‌ ను 6-4తో సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి సెట్‌ లో ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో సుదీర్ఘ ర్యాలీలు బాగా సాగాయి. చివరికి 6-6 తో సెట్ సమమైంది. తనకు అచ్చొచ్చిన టై బ్రేకర్‌ కావడంతో థీమ్‌ మరోసారి తన స్టైల్ లో రెచ్చిపోయాడు. ఒక దశలో 3-0 తో ముందంజ వేయడం సహా చివరికి 7-3తో ముగించి సెట్‌ను చేదక్కించుకున్నాడు. నాలుగో సెట్‌ లో సర్వీస్‌ లను కాపాడుకునేందుకు ఇద్దరు శాయశక్తులా వారు శ్రమించారు. దీనితో ఫలితం టైబ్రేకర్‌ వరకూ వెళ్లింది. ఈసారి కూడా 3-0తో దూకుడు కనబరిచిన థీమ్‌ ఆ సెట్‌ ని కూడా కైవసం చేసుకొని ఫైనల్లో అడుగుపెట్టాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: