టీమిండియా ఇప్పటికే వరుస సిరీస్ లతో  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్తో 5 టీ20 సిరీస్ ను ఆడుతుంది టీమిండియా. కాగా ఎప్పటిలాగానే ఈ సిరీస్ లో కూడా టీమిండియా తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది. న్యూజిలాండ్ జట్టును చిత్తు చేస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తుంది టీమిండియా. ప్రతి ఒక ఆటగాడు టీమిండియా గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తూ మ్యాచ్ ను  విజయ తీరాల వైపు నడిపిస్తున్నారు. టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి... సిరీస్ను కైవసం చేసుకుంది. 

 

 

 ఇప్పటికీ గెలుపు పై ఆశ తీరక న్యూజిలాండ్ జట్టును క్లీన్స్వీప్ చేయాలని భావించింది టీమిండియా. ఈ క్రమంలో  నాలుగో టి20 మ్యాచ్ లో కూడా సూపర్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన మూడు నాలుగు టి20 మ్యాచ్ లు సూపర్ ద్వారానే విజయాన్ని సాధించింది టీమిండియా. దీంతో ఈ రెండు మ్యాచ్ లో  మరింత ఉత్కంఠగా మారాయి. ఇక టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య రేపు చివరి టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి  నుంచి విజయపరంపర కొనసాగిస్తున్న టీమిండియా ఐదు వన్డే మ్యాచ్లు ప్రయోగాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఈ క్రమంలోనే మొన్నటి వరకు బెంజ్ కే పరిమితమైన కొంత మంది ఆటగాళ్లకు జట్టులో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు జరుగుతున్న చివరి టి20 మ్యాచ్ భారత జట్టులో భారీ మార్పులలో భాగంగా.. అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్న కోహ్లీరాహుల్,  బుమ్రా లకు విశ్రాంతిని  ఇచ్చి 5వ  టి20 మ్యాచ్ ఇతురులకు అవకాశం   ఇవ్వాలని టీమిండియా యాజమాన్యం  భావిస్తోందట. సంజు శాంసన్, శివం దూబే లకు మరోసారి అవకాశం కల్పించాలని ఇండియా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గత 4 మ్యాచ్ ల నుండి బెంచ్ స్ట్రెంత్ కే పరిమితమైన రిషబ్ పంత్ కు 5వ టి20 మ్యాచ్ తుది జట్టులో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ కి రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: