న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో దుమ్ములేపుతున్న భార‌త్ చివరి టీ - 20 పోరుకు సిద్ధ‌మైంది. మౌంట్ మాంగ‌నీలో జ‌రుగుతున్న చివరిదైన ఐదో టీ - 20లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ని ఎంచుకున్నాడు. ఐదు మ్యాచ్‌ ల సిరీస్‌ లో ఇప్ప‌టికే టీం ఇండియా 4-0తో ఆధిక్యంలో ఉంది.

 

 

మౌంట్ మాంగ‌నీలోని బే ఓవ‌ల్ మైదానంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌ లో భార‌త జట్టు హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగుతోంది. ఐదు టీ - 20ల సిరీస్‌ ను ఇంకా 2 మ్యాచ్‌ లు మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకున్న భార‌త్‌ వెల్లింగ్ట‌న్‌ లో జ‌రిగిన నాలుగో టీ - 20లోనూ అద్భుత విజ‌యం సాధించి. దీనితో 4-0 ఆధిక్యంలో టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌ లో అన్ని రంగాల్లో భారత్ ప‌టిష్టంగా కనపడుతోంది. 

 

 

ఈ మ్యాచ్‌ లో కూడా నెగ్గి ఐదు టీ20ల సిరీస్‌ ని క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ పట్టుదలగా ఉంది. స్ట్రోక్ ప్లేకు అనుకూలమైన ఈ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నామని రోహిత్ శర్మ చెప్పాడు. నిజానికి జట్టులో కొన్ని మార్పులు చేయాలని భావించినా విజయం సాధించిన గత జట్టును ఎక్కువగా మార్చడానికి ఇష్టపడలేదని తెలిపాడు. నేటి మ్యాచ్‌ లో భారత్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. అది కూడా ముఖ్యమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చి, తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. అదే ఈ మ్యాచ్‌లో కివీస్‌లో మార్పులేమీ లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: