వరుసగా అన్ని జట్లను చిత్తు చేస్తూ వరుస సిరీస్ లను  సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది టీమిండియా. అయితే ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్తో ఐదు టి20 సిరీస్ లు  ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్ వేదికగా ఆడిన నాలుగు టి20 మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది ఇండియా. ప్రత్యర్థి ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ చిత్తు చేస్తూ 4 టి20 మ్యాచ్ లు  గెలిచింది. వరుసగా మూడు టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. అయినప్పటికీ గెలుపు పై ఆశ తీరక... మరో రెండు మ్యాచ్లు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని దృడ సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే నాలుగో మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. 

 

 

 ఇక ఈ రోజు న్యూజిలాండ్తో ఐదు టి20 మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఈ మ్యాచ్లో టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహాపలువురు ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది టీమిండియా యాజమాన్యం. ఇంకా రిజర్వు ఆటగాళ్ళకు ఉన్న కొందరికి తుది జట్టులో ఛాన్స్ ఇచ్చి ఆడిస్తోంది. కాగా న్యూజిలాండ్ తో  చివరి  టీ20 మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు చేసింది టీమిండియా. మౌంట్ మాంగానూయ్ వేదికగా  ఈరోజు జరుగుతున్న ఐదో  వన్డే టి20 మ్యాచ్ లో.. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా కె.ఎల్.రాహుల్ 45 పరుగులు చేయగా మరో ఓపెనర్ సంజు సాంసంగ్ రెండు పరుగులు చేసి మరొకసారి విఫలమయ్యాడు. 

 

 

 అయితే విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వడం తో జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. అయితే  అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు అనే చెప్పాలి. 41 బంతుల్లో  60 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అయితే అప్పటికే ఆఫ్ సెంచరీ కొట్టి మంచి జోరు మీదున్న రోహిత్ శర్మ గాయం కారణంగా బ్యాటింగ్  చేయలేకపోవడంతో రిటైర్డ్ హర్ట్ అయిపోయాడు. గాయంతో నడవలేని స్థితిలో ఉన్న రోహిత్ శర్మ మైదానం వీడాడు . ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ బాగా రాణించి 33 పరు గులతో నాటౌట్గా నిలిచాడు. చివర్లో మనీష్ పాండే మెరుపులు మెరిపించి నాలుగు బంతుల్లో 11 పరుగులు చేశాడు. మొత్తంగా  న్యూజిలాండ్ ముందు  164 పరుగుల టార్గెట్ ను ఉంచింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: