అవకాశాలు ఇవ్వట్లేదని ఇన్ని రోజులు  బీసీసీఐని   విమర్శించిన  టీమిండియా  అభిమానులకు అవకాశం ఇస్తే  సంజు సాంసన్ చేసిన పనికి ఇప్పుడు  నోటా  మాట  రావడం లేదు. రాక రాక రెండు బంగారం లాంటి అవకాశాలు వస్తే  వాటిని సద్వనియోగం చేసుకోవడం  లో అతను దారుణంగా విఫలమయ్యాడు. అందులో భాగంగా న్యూజిలాండ్ తో నాల్గో టీ 20 లో ఏకంగా ఓపెనర్  గా అవకాశం దక్కించుకున్న సంజు  ఆ మ్యాచ్ లో కేవలం 8పరుగులే చేసి అవుట్ అయ్యాడు. కుంగ్ లీన్ బౌలింగ్ లో  అవసరం లేకున్నా షాట్ కు యత్నించి సాన్ ట్నర్ కు  క్యాచ్  ఇచ్చి అవుట్ అయ్యాడు. 
 
ఇక ఈరోజు జరుగుతున్న  5వ టీ 20లో సంజు కు బదులు  పంత్ కు ఛాన్స్ ఇస్తారని భావించినా  మళ్ళీ  సంజు నే అవకాశం దక్కించుకున్నాడు. అయితే  ముందు మ్యాచ్ లో లాగా ఈమ్యాచ్ లో కూడా ఓపెనర్ గా వచ్చిన సంజు  మరో సారి అదే తరహాలో అవుట్ అయ్యి  దారుణంగా  నిరాశపరిచాడు.  దాంతో  నెక్స్ట్ సిరీస్ తోపాటు  టీ 20 వరల్డ్ కప్  అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాడు.   ఎలాగూ ఎన్ని అవకాశాలు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం తో ఇప్పుడు బెంచ్ కే పరిమితం అవుతున్నాడు రిషబ్ పంత్. ఇలాంటి సమయం లో అవకాశం దక్కించుకున్నసంజు అంచనాలను అందుకునేలా ఆడివుంటే  తన కెరీర్  కు చాలా హెల్ఫ్ అయ్యింది.  అయితే పంత్ కు వచ్చినన్ని ఛాన్స్ లు  అతనికి రాలేదు.  ఇక మీద  పంత్ తోపాటు  సంజు కు కూడా  అవకాశం వస్తుందన్న గ్యారెంటీ  కూడా లేదు.  ఎందుకంటే అటు రాహుల్ కీపర్ గా కూడా అదరగొడుతుండడం తో ఈ ఇద్దరికి  దారులు మూసుకుపోయినట్లే .. 

మరింత సమాచారం తెలుసుకోండి: