ఈరోజు న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగ‌నీలో జరుగుతున్న చివరిదైన ఐదో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లకి గాను 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ తన ఫామ్ కి అనుగుణంగా 45 పరుగులు, అలాగే నేటి మ్యాచ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కాలి నొప్పి కారణంతో 60 పరుగుల వద్ద రిటైర్డ్ తీసుకున్నాడు.తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, మనీష్ పాండే 11 పరుగులతో నాట్ అవుట్ గా చివరి వరకు నిలిచారు. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే కుగ్గేలెజిన్ రెండు వికెట్లు, బెన్నెట్ ఒక వికెట్ పడగొట్టారు. 

 

లక్ష ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కి అదిలోనే ముడి వికెట్లు త్వరగా కోల్పోవడంతో కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. అయితే పదో ఓవర్ వేసిన శివమ్ దూబే ఏకంగా 34 పరుగులు సమర్పించడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారి పోయింది. దీనితో ఆ దశలో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ వెళ్ళింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు కాస్త కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో  న్యూజిలాండ్ వరుస వికెట్లు కోల్పవడంతో మళ్లీ మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. 

 

దీనితో న్యూజిలాండ్ జట్టు నిర్ణిత ఓవర్లు ముగిసాక తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ ని 5 - 0 తో కివీస్ ని క్లీన్ స్వీప్ చేయగలిగింది. ఇక టీం ఇండియా బౌలింగ్ లో  బుమ్రా 3 వికెట్లు, షైనీ 2 వికెట్లు, శార్దూల ఠాకూర్ 2  వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: