ఈరోజు న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు టి20 మ్యాచ్ సిరీస్ న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగింది. అయితే మొదటి నుంచి విజయ పరంపర కొనసాగించిన టీమిండియా... ఐదు టి20 సిరీస్ లను వరుసగా గెలుచుకుని న్యూజిలాండ్ టీం కు కనీసం గెలిచే అవకాశం కూడా ఇవ్వలేదు. మూడు నాలుగు టి20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ వరకు వచ్చినప్పటికీ టీమిండియా పట్టువదలకుండా సూపర్ ఓవర్ లో  కూడా అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. ఇక ఐదవ  టి-20లో ప్రయోగాలకు పెద్దపీట వేసిన టీమిండియా యాజమాన్యం మొన్నటి వరకు రిజర్వ్ స్ట్రెంత్  గా ఉన్న కొంతమందికి  జట్టులో అవకాశం కల్పించింది. 

 

 

 ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీకి శాంతి కల్పించిన టీమ్ ఇండియా యాజమాన్యం ఐదు టి20 మ్యాచ్ ను  రోహిత్ కెప్టెన్సీలో నిర్వహించింది. అయితే మొన్నటి వరకు రిజర్వుడు స్ట్రెంత్  గా ఉన్న వారిలో శివమ్  దూబే  ఒకరు.  టి20 సిరీస్ లో ఆడడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న శివమ్ దూబే కు  అవకాశం రానే వచ్చింది. అయితే కోరి వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాడు శివమ్  దూబే  అంతగా వాడుకోలేక పోయాడు అని చెప్పాలి. వాడుకోలేక పోవడం కాదు... అతి దారుణంగా విఫలం అయ్యాడు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 ఐదో టి20 మ్యాచ్ లో శివమ్ దూబే  ఎంతగా విఫలమయ్యాడు అంటే... ఏకంగా అతి చెత్త రికార్డును నమోదు చేసేంతగా  విఫలమయ్యాడు. ఐదో  టి-20లో బౌలింగ్ వేసిన శివం దూబే ... కివీస్ బ్యాట్స్ మెన్స్ కు  భారీగా పరుగులను ముట్ట  చెప్పాడు. అయితే టీ20 లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు ఇప్పుడు వరకు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. స్టువర్ట్  అత్యధికంగా ఓకే ఓవర్ లో  32 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ రోజు న్యూజిలాండ్తో జరిగిన ఐదో  టీ20 మ్యాచ్లో శివం దూబే  ఒకే ఓవర్లో 34 పరుగులు ఇచ్చి... చెత్త రికార్డులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్  లో కూడా రాణించలేకపోయాడు శివమ్ దూబే .

మరింత సమాచారం తెలుసుకోండి: