బుల్లెట్ లాంటి బంతులు  విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను  కట్టడి చేయ గలడు... అదిరిపోయే బౌన్సర్ లు విసురుతూ ఎంతటి బ్యాట్స్మెన్ అయినా తికమక పెట్టగలడు... ఇక పదునైన యార్కర్ లతో  అలవోకగా వికెట్లు పడగొట్టగలడు ... మొత్తంగా అద్భుతమైన బౌలింగ్ చేసి క్రికెట్ ప్రేక్షకుల మనసు దోచుకోగలడు...ఆ  ఆటగాడే ఇండియన్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా. ప్రస్తుతం జస్ప్రిత్ బూమ్రా బౌలింగ్  కి తిరుగు లేదని చెప్పాలి. తనదైన స్టైల్ అద్భుతమైన బౌలింగ్తో టీమిండియాలో కీలక బౌలర్ గా మారిపోయాడు. ఇప్పటికే తన బౌలింగ్తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఓ వైపు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తునే  మరోవైపు... అద్భుతంగా వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు  ఈ ఆటగాడు. 

 


 ఇక తాజాగా కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ లో కూడా అద్భుత ప్రదర్శన చేసి అదరగొట్టాడు. ఇక ఇండియా కివీస్ తో ఆడిన ఐదు మ్యాచ్లలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు కివీస్ జట్టు గెలిచే అవకాశాలు వచ్చినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేక.. టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టినది కివీస్ జట్టు. ఇక చివరి టి20 మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో 5 మ్యాచ్ లు  గెలిచి  టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన చెట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది, అంతేకాకుండా టీ20 చరిత్రలోనే 5 మ్యాచ్ ల  ద్వైపాక్షిక సిరీస్లో ఓటమి లేకుండా ఒక జట్టు విజయం సాధించడం కూడా ఇదే తొలిసారి. 

 


 ఇక ఈ ఆఖరి టి20 మ్యాచ్ లో జస్ప్రిత్ బూమ్రా సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన జస్ప్రిత్ బూమ్రా సంచలన రికార్డు సృష్టించాడు. 5వ టి20 మ్యాచ్ లో భాగంగా జస్ప్రిత్ బూమ్రా మూడు వికెట్లు సాధించడంతో పాటు 12 పరుగులు ఇచ్చి ఒక మెయిడెడ్  ఓవర్ ని సాధించాడు. దీంతో ఇంటర్నేషనల్ టి20 కెరియర్ లో ఏడో మెయిడెడ్  నమోదు చేశాడు. కాగా  అత్యధిక. మెయిడెడ్ ఓవర్లు వేసిన బౌలర్గా రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ నువాన్  కులశేఖర పేరు మీద ఉంది. 58 మ్యాచ్లు సుదీర్ఘ 20 కెరియర్లో నువాన్  కులశేఖర 6 మెయిడెడ్ ఓవర్లు వేయగా .... ప్రస్తుతం భూముల రికార్డులను తిరగరాశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: