నిన్న మౌంట్మంగాని  వేదికగా జరిగిన ఐదో  టి20 మ్యాచ్ లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. వరుసగా ఐదు టి20 మ్యాచ్ లలో విజయం సాధించి న్యూజిలాండ్ దేశం లోని న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది. అయితే క్రికెట్ చూడడానికి ఎంతో మంది అభిమానులు స్టేడియం కి వస్తారు అన్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన అభిమానులు కొన్ని కొన్ని సార్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. స్టేడియంలో నుండి  ఆటగాళ్లను దూషిస్తూ ఉండటం లేదా లేదా ఇంకేదైనా చేస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక నిన్న జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో భారత అభిమాని ఇలాంటిదే చేసాడు . న్యూజిలాండ్ లో ఉండే  ఒక భారత అభిమాని కామెంటేటర్ దూషించాడు. 

 


 గ్రౌండ్లో ఉన్న కామెంటేటర్ వద్దకు వెళ్లిన భారత అభిమాని తనకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి అంటూ కామెంటేటర్ ను  కోరాడు.కాగా సదరు అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు మాత్రం కామెంటేటర్ నిరాకరించాడు. దీంతో సైలెంట్గా ఊరుకోకుండా ఆ కామెంటేటర్ ను దూషించడం మొదలుపెట్టాడు సదరు అభిమాని. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమాని స్టేడియం బయటకు పంపించేశారు. ఈ క్రమంలోనే అతని పై నిషేధం కూడా విధించారు స్టేడియం నిర్వాహకులు. ఈ స్టేడియంలో జరిగే ఏ మ్యాచ్ కు  కూడా అతనికి అనుమతి ఇవ్వబోమని అంటూ న్యూజిలాండ్ క్రికెట్ పబ్లిక్ ఎఫ్ఫైర్స్  మేనేజర్ రిచర్డ్  బూక్ తెలిపారు. కామెంటేటర్ ను దూషిస్తూ  అసభ్యంగా ప్రవర్తించిన కారణంగానే సదరు వ్యక్తికి నిషేధం విధించామని... ఒకవేళ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి ఉంటే శిక్ష మరోలా ఉండేది అంటూ పేర్కొన్నారు. ఇక్కడ ఆ కామెంటేటర్ ఎవరు అనేది మాత్రం సీక్రెట్గానే ఉంచారు. 

 


 ఇదిలా ఉంటే.. గతేడాది చివర్లో ఇంగ్లాండ్ క్రికెటర్ జొఫ్రా ఆర్చర్ పై కూడా న్యూజిలాండ్కు చెందిన క్రికెట్ అభిమాని అసభ్యకర రీతిలో దూషించడంతో  అతనిపై నిషేధం  విధించిన విషయం తెలిసిందే.గతేడాది  నవంబరులో  న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు... ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన ఆర్చర్  పై.. న్యూజిలాండ్ క్రికెట్ అభిమాని వర్ణవివక్ష చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అంతటితో ఆగకుండా మరింత అవమానించేలా మాట్లాడడంతో తొలుత అతన్ని అరెస్ట్ చేసి అతనిపై రెండేళ్ల పాటు క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియాలకు  రాకుండా నిషేధం విధించారు. తాజాగా భారత అభిమానీపై  కూడా ఇలాంటిదే జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: