న్యూజిలాండ్ తో తాజాగా జరిగిన  5టీ 20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి  ఫుల్ జోష్ లో వున్న  టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చివరి టీ 20 లో బ్యాటింగ్ చేస్తూ  గాయపడ్డ  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ,కివీస్ తో జరుగనున్న వన్డే ,టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. దాంతో  అతని స్థానం లో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే మరో స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్  గాయం కారణంగా వన్డే సిరీస్ నుండి తప్పుకోగా తాజాగా రోహిత్ కూడా దూరమయ్యాడు. 
 
అయితే వన్డే సిరీస్ కు ఇదివరకే  జట్టును ప్రకటించిన  బీసీసీఐ ,బ్యాక్ అప్ ఓపెనర్ గా పృథ్వీ షా ను ఎంపికచేసింది. దాంతో రాహుల్ కు జోడిగా  పృథ్వీ షా  ఓపెనర్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎలాగూ పృథ్వీ షా వున్నాడు కాబట్టి  రోహిత్ స్థానం లో  మరొకరిని తీసుకుంటారో లేదో చూడాలి. ఇక రోహిత్  టెస్టు సిరీస్ నుండి కూడా  తప్పుకోవడం తో  అతని స్థానాన్ని  శుభమాన్ గిల్ తో భర్తీ చేయనున్నారు.  దాంతో మయాంక్ కు జోడిగా  గిల్ ఓపెనింగ్  చేసే  ఛాన్స్ వుంది. అలాగే అద్భుతమైన ఫామ్ లో వున్న కేఎల్ రాహుల్  బ్యాక్ అప్ ఓపెనర్ గా ఎంపికయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. త్వరలోనే బీసీసీఐ ,టెస్టులకు భారత జట్టును ప్రకటించనుంది. 
 
భారత జట్టు (వన్డే) :
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,రాహుల్ ,పృథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , శివమ్ దూబే , మనీష్ పాండే , కుల్దీప్ యాదవ్ , చాహల్ ,సైనీ , బుమ్రా ,  శార్దూల్ ఠాకూర్  ,షమీ ,రవీంద్ర జడేజా ,కేదార్ జాదవ్

మరింత సమాచారం తెలుసుకోండి: