టీమిండియాను ఏ జట్టు కూడా ఎదుర్కోలేక పోతుంది. అని జట్లని  చిత్తు చేస్తూ వరుస  సిరీస్ లను  గెలుచుకుంటు టీమిండియా దూసుకుపోతోంది. ఇక ప్రత్యర్థి జట్టు ఎవరైనా తమదైన స్టైల్లో అద్భుత ప్రదర్శన చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే వరుస సిరీస్ లను  గెలుచుకున్న సత్తా చాటుతోంది. ఇకపోతే తాజాగా న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో వరుసగా 3 టీ 20 మ్యాచ్ లు  క్రికెట్ సిరీస్ను కైవసం చేసుకుంది  టీమిండియా. అయినప్పటికీ గెలుపుపై ఆశ  తీరకపోవడంతో.. మరో రెండు మ్యాచ్లు గెలిచి  న్యూజిలాండ్లో న్యూజిలాండ్ జట్టును  క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమిండియా పట్టుదలతో ముందుకు సాగి వరుసగా ఐదు టి-20 మ్యాచ్ లను  గెలిచి  సంచలన రికార్డు నమోదు చేసింది . 

 

 అయితే న్యూజిలాండ్ దేశం లో న్యూజిలాండ్ జట్టుతో ఆడి వరుసగా ఐదు టి20 మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ ను  క్లీన్స్వీప్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడం మామూలు విషయం ఏమీ కాదు. ఇలాంటిది  చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే న్యూజిలాండ్తో జరిగిన ఐదు టి20 మ్యాచ్ లలో రెండు టి20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ ద్వారా టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే న్యూజిలాండ్తో ఐదో  20 మ్యాచ్లో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వగా..  రోహిత్  కెప్టెన్సీ  వహించాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారీగా గాయం కావడంతో విలవిలలాడి పోయిన రోహిత్ శర్మ... రిటైర్డ్ హార్డ్  గా మైదానం నుంచి వెను దిరిగిన  విషయం తెలిసిందే. ఆ తర్వాత జుట్టుకు రాహుల్ కెప్టెన్సీ వహించగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో  విజయం సాధించింది. 

 

 

 ఇకపోతే న్యూజిలాండ్తో బుధవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ స్థానంలో ఎవరు రాబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్లేస్లో ఆటగాళ్లు శుబ్ మన్  గిల్ .. మయాంక్ అగర్వాల్ పేర్లను టీమ్ ఇండియా యాజమాన్యం  పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో ఇటీవలే భారత్ ఏ టీం తరఫున ఆడిన శుబ్ మన్ గిల్  డబుల్ సెంచరీ చేయడంతో అతనికే  ఛాన్స్ దక్కె  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కాగా  గాయం కారణంగా జట్టు దూరమైనా ధావన్ ప్లేస్ లో యువ సంచలనం పృద్వి షా చోటు  దక్కించుకోగా.. రాహుల్ తో కలిసి పృద్వి షా  ఓపెనింగ్ బ్యాటింగ్ దిగనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: