విరాట్ కోహ్లీ.. క్రికెట్ వీరుడు... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ను 5కు 5 సాధించి భారత్ గెలుచుకున్న సంగతి విదితమే. భారత్ ఘన విజయం సాధించడంతో క్రికెట్ ప్రేమికులు ఆనందంలో మునిగితేలారు. ఎంతలా అంటే.. క్లిన్ స్వీప్ చేసి రెండు రోజులు అయినా ఆ మ్యాచ్ ను మరవనంతగా.

 

అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా విజయంపై ఎందరో ట్విట్లు చేస్తున్నారు. ట్విట్ చేసిన అందరూ పొగిడినవారే.. అయితే విరాట్ కోహ్లీ టీమ్ అత్యంత అద్భుతంగా ఆడింది అని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ట్విట్ చేశాడు. ఆ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అతను ఏం అని ట్విట్ చేశాడు అంటే.. ''న్యూజిలాండ్‌లో ఉన్న కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు.. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాక్ జట్టును గుర్తు చేస్తోంది. బలమైన సెల్ఫ్ డిఫెన్స్ జట్టులో పుష్కలంగా ఉంది. పరాజయం అంచుకు చేరుకున్న జట్టును గట్టెక్కించేందుకు ఇమ్రాన్ కూడా వివిధ మార్గాలు వెతికేవాడు. మనపై మనకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది'' అని మంజ్రేకర్ ట్విట్ చేశాడు.

 

అయితే ఆ ట్విట్ చుసిన నెటిజన్లు.. ఆ ట్విట్ ను మరోలా అర్థం చేసుకున్నారు.. అది ఎలా అంటే.. విరాట్ కోహ్లీ టీమ్ తో ఇమ్రాన్ ఖాన్ టీమ్ ని పోల్చారు.. అంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ మార్గాలు వెతికినట్టు ఇప్పుడు కోహ్లీ వెతుకుతున్నాడు అంటున్నారు.. మరి కోహ్లీ కూడా ఇమ్రాన్ ఖాన్ లా రాజకీయాలలోకి వస్తాడా? వస్తే ప్రధాన మంత్రి అవుతాడా ? అంటూ నెటిజన్లు ట్విట్లు చెయ్యడం ప్రారంభించారు. మరి నెటిజన్లు అనుకున్నట్టే విరాట్ కోహ్లీ భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతాడా?

 

మరింత సమాచారం తెలుసుకోండి: