ఆ ఆటగాడు బరిలోకి దిగాడు  అంటే క్రికెట్ ప్రేక్షకులందరూ కన్నార్పకుండా చూస్తూ ఉంటారూ... ప్రతి బాల్ కి  ఏదో ఒక అద్భుతం షాట్ కొడుతూ ఉంటాడు. బాల్ తో కూడా ఎన్నో కీలక వికెట్లు తీస్తూ ఉంటాడు... ఒక ఫీల్డింగ్  విషయానికొస్తే ఎంత చెప్పినా తక్కువే. కళ్ళు చెదిరే క్యాచ్ లు పడుతూ అద్భుతమైన ఫీల్డింగ్  అదరగొడతాడు. ఇంతకీ ఆటగాడు ఎవరు అనుకుంటున్నారా... టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా  ప్రస్తుతం విదేశాల్లో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా గాయం నుంచి కోలుకున్న పాండ్యా  న్యూజిలాండ్ ఏ జట్టుకు  మొదటి ఎంపిక చేసినప్పటికీ... తర్వాత ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ అవడంతో జట్టు  నుంచి అతని పేరును తొలగించారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో హార్థిక్ పాండ్యా శిక్షణ పొందుతున్నాడు. 

 

 

 అయితే తాజాగా హార్దిక్ పాండ్య కు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడు. ఐపీఎల్ కు  ఇంకా ఎంతో సమయం ఉందని... అప్పుడు వరకు 120% ఫిట్నెస్తో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ సూచించాడు. ఎందుకంటే గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు పునరాగమనం ముఖ్యం కాదని.... జట్టులోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తామనే  పరిగణనలోకి తీసుకుంటారు అంటూ జహీర్ ఖాన్ తెలిపాడు . జుట్టుకు దూరమైనప్పుడు ప్రతి ఆటగాడు ఎంతో అసహనంతో ఉంటారని కానీ ఓపికతో ఉంటేనే తిరిగి కోలుకోగలం అంటూ సూచించాడు . శరీరం పూర్తిగా మన మాట వినాలి... నీకు ఇప్పుడు ఓపిక అనేది ఎంతగానో అవసరం అంటూ జహీర్ ఖాన్ సూచించాడు.

 

 

 అందుకే హార్దిక్ పాండ్యా ఎంతో ఓపికతో ప్రస్తుతం సహాయ సిబ్బంది ట్రైనర్స్ తో పాటు వైద్య సిబ్బంది మాటలు వినాల్సిన అవసరం ఉంది అంటూ జహీర్ఖాన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సాధించిన అద్భుత విజయం పై కూడా జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఇండియా 5-0 తేడాతో ఆతిథ్య జట్టుతో గెలవడం గొప్ప విషయం అంటూ జహీర్ఖాన్ ప్రశంసించాడు. కివీస్ జట్టు క్లిష్ట  పరిస్థితుల్లో ఉందని టీమిండియాను ఎదుర్కోవడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తెలిపాడు. టీమ్ ఇండియా తో వన్డే సిరీస్ కూడా న్యూజిలాండ్ జట్టుకు సవాలుగా మారనుంది అంటూ జహీర్ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: