గత కొన్ని రోజులుగా భారత జట్టు వరుసగా సిరీస్ను కైవసం చేసు కుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే టీమ్ ఇండియా జట్టే కాదు అటు అండర్-19 జట్టు కూడా తమకు ఎదురు లేదు అని నిరూపిస్తుంది. ప్రస్తుతం టీమిండియా అండర్-19 జట్టు వరల్డ్ కప్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యర్థి జట్టులు  అన్నింటిని చిత్తు చేస్తూ సెమీఫైనల్కు చేరుకుంది అండర్-19 జట్టు. ప్రతి మ్యాచ్లో కుర్రాళ్లు అదరగొట్టే సెమీఫైనల్స్ వరకు వచ్చారు. ఇక సెమీఫైనల్స్లో భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో మ్యాచ్  ఆడింది. కాగా మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్... 172 పరుగులను అతికష్టంగా చేసింది.భారత  బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాట్ మెన్స్  తట్టుకోలేకపోయారు. దీంతో 173 పరుగుల  లక్ష్యాన్ని  టీమిండియా ముందుంచారు. 

 

 ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లు చెలరేగిపోయారు అని చెప్పాలి. కుర్రాళ్లు చిరకాల ప్రత్యర్థి.. పాకిస్తాన్ బౌలింగ్లో కుర్రాళ్ళు కుమ్మేశారు. ముఖ్యంగా టీమిండియా అండర్-19 జట్టు ఓపెనర్లు అయినా యశ్వంత్ 105 పరుగులు సాధించాడు... ఏకంగా బరిలోకి దిగినప్పటి నుంచి ఫోర్లు సిక్సర్లతో మోత మోగించాడు. మరో ఓపెనర్ దివ్యాన్స్  సక్సేనా 59 పరుగులు చేశాడు. దీంతో బరిలోకి దిగిన ఓపెనర్లు ఒక వికెట్ కూడా పడకుండానే మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం  చేజిక్కించుకుంది. భారత ఓపెనర్లు చెలరేగి ఆడుతుంటే ఎలా కట్టడి  చేయాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. 

 

 

 కాగా  గురువారం న్యూజిలాండ్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో గెలిచినా  జట్టుతో టీమిండియా తుది పోరుకు సిద్ధం అయ్యింది.  ఇక అండర్ నైన్ టీన్ ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఫిబ్రవరి 9న ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి ఆపసోపాలు పడుతూ 43.1 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు అందరూ బుల్లెట్ లాంటి బంతులతో  ఇబ్బందులు పడుతుంటే... పాకిస్తాన్ బ్యాట్ మెన్స్  అందరూ ఇబ్బందులు పడుతూ స్కోర్  నత్తనడకన నడిపిస్తూ ముందుకు నెట్టుకొచ్చారు. ఇక అండర్ నైన్ టీన్ జట్టు అద్భుత విజయం సాధించడంపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: