అండర్ 19వరల్డ్ కప్ లో టీమిండియా అండర్ 19జట్టుకు ఎదురులేకుండా పోయింది. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన  భారత్ ఈ టోర్నీ లో ఇప్పటివరకు  ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.  తాజాగా మంగళవారం పాకిస్థాన్ తో జరిగిన  మొదటి సెమిస్ లో టీమిండియా 10వికెట్ల తేడాతో గెలిచి  ఫైనల్ లోకి అడుగు పెట్టింది.  ఈమ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 43.1ఓవర్లలో 172 పరుగులకే కుప్ప కూలింది. భారత బౌలర్ల లో సుశాంత్ మిశ్రా 3, కార్తీక్ త్యాగి 2,రవి బిష్ణోయ్ 2, వికెట్లు పడగొట్టగా అంకోలేకర్ ,జైస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. 
 
అనంతరం స్వల్ప లక్ష్యం తో  బరిలోకి దిగిన టీమిండియా  ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండా  35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని  చేరుకుంది. అద్భుతమైన ఫామ్ లోఉన్న  యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 105* మరో ఓపెనర్ సక్సేనా 59* పరుగులతో రాణించారు.  సెంచరీ తో చెలరేగిన  జైస్వాల్ కు  ప్లేయర్ అఫ్ ది మ్యాచ్  అవార్డు దక్కింది. ఇక జైస్వాల్ ఈ టోర్నీ లో ఓ సెంచరీ , మూడు హాఫ్ సెంచరీలతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: