ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్ ) అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన జట్టు చైన్నై సూపర్ కింగ్స్ నిలిచింది . ఆ జట్టు బ్రాండ్ విలువ ఏకంగా 75 మిలియన్ డాలర్లుగా ఒక సర్వే సంస్థ వెల్లడించింది . 2008 లో చైన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ కేవలం 39 మిలియన్ డాలర్లు కాగా , ఈ 12 ఏళ్ల వ్యవధిలో 90 శాతం తన బ్రాండ్ విలువను ఆ జట్టు పెంచుకుని, ఇతర జట్లను వెనక్కి నెట్టి  అగ్రస్థానం లో నిలిచింది .  

 

12 ఎడిషన్ల ఐపీల్ సీజన్ల లో 10సార్లు ఆడిన చైన్నై జట్టు నిలకడగా రాణిస్తూ , ప్రతి ఏడాది ప్లే ఆఫ్ కు చేరుకోవడం ద్వారా తన బ్రాండ్ విలువను పెంచుకుంటూ వచ్చింది . ఇక 2016, 17 సీజన్లలో బహిష్కరణ కారణంగా చెన్నై జట్టు ఐపీల్ టోర్నీ కి దూరమైన విషయం తెల్సిందే .  చైన్నై తరువాతి స్థానాన్ని అనూహ్యంగా కోల్ కత్తా  నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది . ఆ జట్టు  66. 5 మిలియన్ల బ్రాండ్ విలువ కలిగి ద్వితీయ  స్థానం లో   నిలిచింది  .  ఐపీల్ టోర్నీ విజేతగా నాలుగుసార్లు నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు మూడవ స్థానం తో సరిపెట్టుకుంది  . ముంబయి జట్టు బ్రాండ్ విలువ 65. 7 మిలియన్ డాలర్లు కాగా , గత ఏడాది ప్లే ఆఫ్ కు చేరుకున్న ఢిల్లీ జట్టు 25 శాతం తన బ్రాండ్ విలువ ను పెంచుకుని నాల్గవ స్థానం లో నిలిచింది .

 

 ఐపీల్ టోర్నీ ని గత ఏడాది  330 బిలియన్ నిమిషాల పాటు , వివిధ మాధ్యమాల ద్వారా ప్రేక్షకులు తిలకించినట్లు బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ వెల్లడించింది . దాదాపు 30 కోట్ల మంది స్ట్రీమింగ్ సర్వీస్ లకు లాగిన్ అయినట్లు తెలిపింది . 44 రోజుల పాటు కొనసాగే ఐపీల్ టోర్నీ ప్రపంచం లోని ఇతర టోర్నీలను తలదన్నే రీతిలో ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రేక్షాధారణ పొందుతున్నదని పేర్కొంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: