ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్తో వివిధ ఫార్మాట్లలో వరుస సిరీస్ లు  ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన ఐదు టి20 సిరీస్ లో... టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతిథ్య జట్టును 5-0 తేడాతో ఓడించి  నుంచి క్లీన్స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ను ఆడుతోంది. న్యూజిలాండ్ ఇండియా వన్డే సిరీస్ ఈ రోజు ప్రారంభమైంది. అయితే గతంలో టి20 సిరీస్ లో ఓడిపోయినప్పటికీ ఈసారి ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ జట్టు ఆటగాళ్ళు ముందుకు సాగుతుంటే మరోసారి క్లీన్స్వీప్ చేయాలని టీమిండియా సంకల్పంతో ఉంది. ఇలా ఉంటే ఇప్పటికే మ్యాచ్ ప్రారంభమైంది. 

 

 

 కాగా హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్కు దిగింది టీమిండియా. ఇక తొలి పది  ఓవర్లలోనే టీమిండియా ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. అయితే టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో అరంగేట్రం చేసిన పృద్వి షా,  మయాంక్  అగర్వాల్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు  అని చెప్పాలి. పృద్వి షా  21 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేయగా... తొలి వికెట్గా పెవిలియన్ చేరిపోయాడు. ఇక ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 31 బంతుల్లో 6 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేసి రెండో వికెట్గా అవుట్ అయిపోయాడు. ఎనిమిదో ఓవర్లు పృద్వి ష... తొమ్మిదో ఓవర్లో మయాంక్ అగర్వాల్ వరుసగా వెనుతిరిగారు. 

 

 

 వీరిద్దరూ జట్టుకు కాస్త శుభారంభాన్ని అందిస్తున్నట్లు గా అనిపించినప్పటికీ... వారి స్కోర్ను భారీ స్కోరు మార్చడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. 11 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. కాగా టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడు. కాగా యువ ఆటగాళ్లు జట్టులోకి ఆరంగేట్రం చేసిన సమయంలో తమ ప్రతిభను నిరూపించుకునే తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి కానీ... మొదటి వన్డే మ్యాచ్ లోనే ఎంతో ఆతృత చూపించి తొందరపడి ఆడుతూ వికెట్ సమర్పించి పెవిలియన్ చేరడంతో ప్రస్తుతం అభిమానులను నిరాశ పరుస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: