ఇప్పటికే ఐదు టి20 సిరీస్ ను గెలిచి ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసి  అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. ఇక ఈ రోజు నుంచి న్యూజిలాండ్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభ మైంది. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన మొదటి వన్డే మ్యాచ్ ఇప్పటికే ప్రారంభమైంది. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్  సెంచరీ సాధించాడు. కాగా  ఎన్నో ఆశలతో ఓపెనర్గా బరిలోకి దిగిన పృథ్వి షా ... మయాంక్ అగర్వాల్ మొదట కాస్త  మెరుపులు మెరిపించినప్పటికి ఆ తర్వాత మైదానంలో కుదురు కోలేక విలియం బాటపట్టిన  విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ... ఒకవైపు ఆచితూచి ఆడుతూనే మరోవైపు భారీ షాట్లు బాదుతూ ... అర్థ శతకం నమోదు చేశాడు. 

 

 

 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. శ్రేయస్ అయ్యర్ తో 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమం తో భారీ భాగస్వామ్యం నెలకొనడంతో న్యూజిలాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ భాగస్వామ్యాన్ని చెదరగొట్టేందుకు న్యూజిలాండ్ బౌలర్లు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ... పెవిలియన్ పంపించడంలో న్యూజిలాండ్ బౌలర్లు విజయం సాధించారు. ఇష్ సోధీ వేసిన 29 ఓవర్లోనే నాలుగో బంతికి  కోహ్లీ క్రికెట్లో సమర్పించుకున్నాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లీ బ్యాట్ కి తాకి  వికెట్లకు తాకింది. ఈ నేపథ్యంలో 150 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోవాల్సి  వచ్చింది.. 

 

 

 అయితే విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యం భారీ స్కోరు నెలకొల్పడం తో టీమిండియా భారీ స్కోర్ సాధించడం ఖాయమని అనుకున్నారు కానీ అంతలోనే విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో క్రికెట్ అభిమానులు కాస్త హార్ట్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా వీరు ఆచితూచి ఆడుతూ రన్ రేటును కాపాడుకుంటూ.. భారీ షాట్లు కంటే సింగిల్స్ డబుల్స్ పైనే దృష్టి పెట్టారు. పరుగుల యంత్రం రికార్డుల రారాజు  విరాట్ కోహ్లీని అవుట్ చేయడంతో న్యూజిలాండ్ ఊపిరిపీల్చుకుంది. ఇక కోహ్లీ అవుటైన తర్వాత శ్రేయస్ అయ్యర్ అదే దూకుడు ఆటను కొనసాగించి 66 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: