అద్భుతమైన ఫామ్ లో వున్న టీమిండియా యువ బ్యాట్స్ మెన్ కమ్ కీపర్  కేఎల్ రాహుల్ హామిల్టన్ లో  న్యూజిలాండ్ తో జరుగుతున్నమొదటి వన్డే లో మాజీ సారథి , వికెట్ కీపర్  ధోని రికార్డు ను బ్రేక్ చేశాడు.  ఈమ్యాచ్ లో  5వస్థానం లో బ్యాటింగ్ కు వచ్చిన  రాహుల్ 64బంతుల్లో 6సిక్సర్లు , 3ఫోర్ల సాయంతో  88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు తద్వారా న్యూజిలాండ్ లో  అత్యధిక  పరుగులు సాధించిన టీమిండియా వికెట్ కీపర్  గా రాహుల్ ఘనత సాధించాడు.  ఇంతకుముందు ధోని 85*పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
 
ఇక కివీస్ తో జరుగుతున్న మొదటి వన్డే లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత  50ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 347పరుగులు చేసింది. రాహుల్ కు తోడు శ్రేయస్ అయ్యర్ సెంచరీ తో కోహ్లీ హాఫ్ సెంచరీ తో రాణించారు. అయితే  కెరీర్ లో మొదటి అంతర్జాతీయ వన్దే మ్యాచ్ ఆడుతున్న యువ ఓపెనర్లు పృథ్వీషా ,మయాంక్ ఆగర్వాల్ తక్కువ పరుగులకే  వెనుదిరిగి  నిరాశపరిచారు. అందులో భాగంగా మయాంక్ 32, పృథ్వీ షా 20పరుగులు చేశారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  న్యూజిలాండ్ దీటుగా జవాబిస్తుంది. ప్రస్తుతం ఆజట్టు 15ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (41*), మార్టిన్ గప్తిల్ (31*)పరుగులతో క్రీజ్ లో వున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: