న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాడు రాస్ టేలర్. ఇప్పటివరకు ఏ న్యూజిలాండ్ క్రికెటర్ కి లేని  అనుభవం ఒక రాస్ టేలర్ కు మాత్రమే ఉంది. అందుకే రాస్ టేలర్ మైదానంలోకి దిగి  ఆడుతున్న సమయంలో జట్టు ఎన్నో ఆశాలను పెట్టుకుంటుంది. ఇక రాస్ టేలర్  కూడా జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నోసార్లు విజయతీరాలకు నడిపించాడు. అనుభవం అంతా ఉపయోగించి కొన్ని కొన్ని సార్లు పదునైన వ్యూహాలను కూడా రచించాడు రాస్ టేలర్. తాజాగా టీమ్ ఇండియా తో జరిగిన టి20 సిరీస్ లో రాస్ టేలర్ తన అనుభవాన్ని ఉపయోగించుకోలేక పోయాడు అని పలు విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో  మాత్రం బ్యాటింగ్ లో  తన అనుభవాన్నంతా రంగరించి అద్భుత ప్రదర్శన చెసాడు. 

 

 

 ఏకంగా  అద్భుతమైన షాట్ లాడుతూ టీమిండియా బౌలర్లను  ఒత్తిడికి గురి చేస్తూ సెంచరీ సాధించాడు రాస్ టేలర్. రాస్ టేలర్ ఏదైనా జోష్ లో  ఉన్నాడు అంటే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక రాస్ టేలర్  కి మైదానంలో ఆనందం వచ్చినప్పుడల్లా నాలుకను బయటకు తీస్తూ ఉంటాడు. సెంచరీ సాధించాడు అంటే  తప్పకుండా తన నాలుకను బయటకు తీసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు రాస్ టేలర్. రాస్ టేలర్ సెంచరీ సాధించగానేని జోష్ లో ఉన్నప్పుడు  నాలుకను ఎందుకు బయటకు తీస్తాడు అనేది మాత్రం చాలా మంది క్రికెట్ అభిమానులకు ఉన్న ప్రశ్న. 

 

 

 కేవలం క్రికెట్ అభిమానులకే కాదు క్రికెటర్లకు కూడా ఇలాంటి ప్రశ్న ఉన్నట్టుంది. ప్రస్తుతం టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్కు కూడా రాస్ టేలర్ జోష్  వచ్చినప్పుడల్లా ఎందుకు నాలుక బయట పెడతాడు అని  అనుమానం  వచ్చినట్లుంది. ఇంకేముంది మనసులో ఉంచుకోలేక రాస్ టేలర్ ను  సోషల్ మీడియా వేదికగా అడిగేశాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావ్  టేలర్.. నువ్వు సెంచరీ చేసిన ప్రతిసారి నాలుకను ఎందుకు బయటకు తీస్తావ్... అంటూ చమస్కరిస్తూ అడిగాడు టీమిండియా స్పిన్నర్ హర్భజన్  సింగ్. మరి దీనిపై రాస్ టేలర్ ఏమని  స్పందిస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: