టీమిండియాలో కీలక బౌలర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు జస్ప్రిత్ బూమ్రా. టీమిండియా గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా తన అద్భుతమైన బౌలింగ్ తో  గట్టెక్కించాడు జస్ప్రిత్ బూమ్రా. తన అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ అందరిని కన్ఫ్యుస్  చేస్తూ... వికెట్లు పడగొట్టడం  బూమ్రా స్పెషలిటి . ఇక బుల్లెట్ లాంటి బంతులు విసిరే... అద్భుతంగా రాణించడం బూమ్రా కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే టీమిండియా విజయాలలో బుమ్రా  ఎంతో కీలకంగా మారి పోతూ ఉంటాడు. ప్రతి మ్యాచ్ లో  అద్భుతంగా రాణిస్తూ... దిగ్గజ బ్యాట్ మెన్లకు  కూడా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ ఉంటాడు జస్ప్రిత్ బూమ్రా.

 

 

 అయితే టీమిండియాలో అద్భుతంగా రాణించిన జస్ప్రీత్ బుమ్రా మొన్న  జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం... తన  స్థాయి ఆట ప్రదర్శించలేక పోయాడు అని చెప్పాలి. ఇప్పటికే టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ సారథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా పటిష్టంగా తయారైంది. ముఖ్యంగా టీమిండియా ఫేస్ దళం  చూసి ప్రత్యర్థి జట్లన్నీ  బెంబేలెత్తిపోతున్నారు. ఇక టీమిండియా పేస్ దళంలో కీలక బౌలర్ అయిన  జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి జస్ప్రీత్  బుమ్రా తాజాగా టీం ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు అనే చెప్పాలి. తాజాగా న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా 24 ఎక్స్ ట్రా రన్స్ ఇచ్చింది. అయితే 24 పరుగుల్లో  13 వైడ్ బాల్స్ వేసి ఎక్స్ ట్రా రన్స్ ఇచ్చింది  జస్ప్రిత్ బూమ్రానే. 

 

 

 టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో జస్ప్రిత్ బూమ్రా ఆట తీరును చూసి క్రికెట్ ప్రేక్షకులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జస్ప్రిత్ బూమ్రా నీకు ఇదేమైనా తొలి వన్డే మ్యాచ్ అనుకుంటున్నావా అంటూ చురకలు అంటిస్తున్నారు. బుమ్రా  ప్రపంచ మేటి బౌలర్ కాదు ఒక చెత్త బౌలర్  అన్న చందంగా టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో బౌలింగ్ చేశాడు. దీంతో టీమిండియా లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బౌలర్ అయిన  నువ్వే ఇలా బౌలింగ్ వేస్తే ఇక  మిగతావాళ్ళ సంగతి ఏంటి అంటూ క్రికెట్ ప్రేక్షకుల బుమ్రా కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక టీమిండియా తాజాగా వైడ్లలో చెత్త ప్రదర్శనల్లో  ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: