టీమిండియా దిగ్గజ క్రికెటర్ సెహ్వాగ్   ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించిన విషయం తెలిసిందే. టీమిండియా జట్టులో స్టార్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్ తో జట్టుకు ఎన్నోసార్లు విజయతీరాలకు చేర్పించారు. సెహ్వాగ్  బ్యాటింగ్కు దిగాడు అంటే ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిపోయారు. ఇక క్రికెట్ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెహ్వాగ్ బ్యాటింగ్  చేస్తున్నాడు అంటే టీవీలకు అతుక్కుపోయి మరి సెహ్వాగ్  బాటింగ్ వీక్షించే వారు. ఎందుకంటే వీరేంద్రుడి  బ్యాటింగ్కు దిగాడు అంటే స్కోరుబోర్డు పరుగులు పెడుతుంది. ఇక ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియాకు  సేవలందించిన సెహ్వాగ్ ... క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించగానే కామెంటేటర్గా కూడా పలుమార్లు క్రికెట్ ప్రేక్షకులను అలరించాడు. 

 


 ఇక సెహ్వాగ్ ఎప్పుడు  అందరితో సరదాగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో అయితే ఎన్నోసార్లు చలోక్తులు విసురుతూ ఉంటారు. పలుమార్లు టీమిండియా ఆటగాళ్ల పై తనదైన స్టైల్ లో ఛలోక్తులు విసిరితే కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. మొత్తానికి అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులను అలరిస్తోంది ఉంటాడూ సెహ్వాగ్. ఇక వీరేంద్రుడు  చేసే వ్యాఖ్యలు నెటిజన్ల అందరిని ఆకట్టుకుంటాయి. 

 

 ఎప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకునేలా గా ఆకర్షించేలా వుంటాయి. ఇక తాజాగా మరోసారి తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులకు జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేసాడు సెహ్వాగ్ . నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా ఏంటో వివరించాడు. నిజం డెబిట్  కార్డు వంటిదని అబద్ధం అంటే క్రెడిట్ కార్డు లాంటిది అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. డెబిట్ కార్డు అంటే ఎప్పుడు డబ్బులు చెల్లించి తర్వాత ఎంజాయ్ చేయడమని అదే క్రెడిట్ కార్డు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసి తర్వాత డబ్బులు చెల్లించమని అంటూ తన ఇంస్టాగ్రామ్ పోస్టు పెట్టాడు సెహ్వాగ్.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్ల ను  ఎంతగానో ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: