సౌతాఫ్రికా  స్టార్ పేసర్  డేల్ స్టెయిన్  అంతర్జాతీయ టీ 20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో జరుగనున్న 3టీ 20ల సిరీస్ కు స్టెయిన్ ను ఎంపిక చేసింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.  గత ఏడాది ప్రపంచ కప్ సమయంలో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే  తప్పుకున్నా స్టెయిన్ ఆతరువాత కొద్దీ రోజులకే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
 
ఇక తాజాగా ఇంగ్లాండ్ తో టీ 20సిరీస్ తో ఏడాది గ్యాప్ తరువాత మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఇదిలావుంటే ఇంగ్లాండ్ తో జరుగనున్న  టీ 20సిరీస్ కు  డుప్లెసిస్ , రబాడ కు విశ్రాంతి నివ్వగా డికాక్ కెప్టెన్ గా  వ్యవహరించనున్నాడు.  ఈనెల 12న ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 జరుగనుంది. 
 
సౌతాఫ్రికా జట్టు  : 
 
డికాక్ (కెప్టెన్ ,కీపర్), బావుమా , వాన్ డెర్ దుస్సేన్ ,డేవిడ్ మిల్లర్ ,జాన్ జాన్ స్మట్స్ ,ఫెహ్లుక్వయో ,షంసి ,ఫార్ట్యూన్ ,సీసండా మగలా , ఎంగిడి ,రిజా హెన్డ్రిక్స్, బ్యురేన్ హెన్డ్రిక్స్, స్టెయిన్ , క్లాసెన్ , ప్రిటోరియస్ , బిల్జోన్ 
 

మరింత సమాచారం తెలుసుకోండి: