ఆక్లాండ్ లో శనివారం ఇండియా తో జరిగిన రెండో వన్డే లో  గెలిచి సిరీస్ ను 2-0 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈమ్యాచ్ ద్వారా  కివీస్  ఫాస్ట్ బౌలర్  కైల్ జమైసన్ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అరంగేట్రం మ్యాచ్ లోనే  అటు బంతి తోనే కాకుండా బ్యాట్ తో కూడా రాణించి జమైసన్ అదుర్స్ అనిపించాడు. అందులో భాగంగా  న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 10వస్థానం లో బ్యాటింగ్ కు వచ్చిన జమైసన్ 24బంతుల్లో రెండు సిక్సర్లు ఓ ఫోర్ సాయం తో 25పరుగుల తో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నెంబర్ వన్ వన్డే  బౌలర్  బుమ్రా బౌలింగ్ లోనే సిక్స్ కొట్టి  ఔరా అనిపించాడు. 
 
ఆతరువాత బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు జమైసన్  . 10ఓవర్ల లో ఓ మేడిన్ వేసి 42పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక పృథ్వీ షా ను అవుట్ చేయడం ద్వారా   జమైసన్  వన్డేల్లో మొదటి వికెట్ ను సాధించాడు. ఈ ప్రదర్శన తో మొదటి మ్యాచ్ లోనే ప్లేయర్  అఫ్ ది మ్యాచ్ ను గెలుచుకొని  జమైసన్  ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇదిలా ఉంటే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య నామమాత్రమైన  మూడో వన్డే మంగళ వారం జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: