శనివారం ఆక్లాండ్ లో జరిగిన  రెండో వన్డే లో టీమిండియా  పై 22 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ ను 2-0 తో గెలుచుకుంది న్యూజిలాండ్ అయితే సిరీస్ గెల్చుకున్నా కూడా న్యూజిలాండ్ కు షాక్ తప్పలేదు. రెండో వన్డే లో  భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్లో ఓవర్  రేట్ కు పాల్పడంతో  మ్యాచ్ రిఫరీ న్యూజిలాండ్  ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు లో 60శాతం  కోత విధించాడు.  ఒక్కో ఓవర్ ఆలస్యమయ్యే కొద్దీ ఓవర్ కు 20శాతం చొప్పున ఫైన్ వేస్తారు  ఈలెక్కన కివీస్ మూడు ఓవర్లు ఆలస్యంగా వేయడం తో 60శాతం కోత పడింది.   
 
కాగా మొదటి వన్డే లో భారత్ ఏకంగా నాలుగు ఓవర్లు ఆలస్యంగా వేయడం తో ఆటగాళ్ల ఫీజు లో 80శాతం  కోత పడింది అంతేకాదు కివీస్ తో జరిగిన రెండు టీ 20ల్లో  టీమిండియా కు ఒకదాంట్లో 20శాతం మరో మ్యాచ్ లో 40 శాతం కోత పడింది. ఇదిలా ఉంటే 5మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఎదురైన ఓటమికి  ప్రస్తుతం జరుగుతున్న  వన్డే సిరీస్ లో వరసగా రెండు విజయాలు సాధించి భారత్ పై ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్ ..  ఇక ఇరు జట్ల మధ్య  నామమాత్రమైన మూడో వన్డే మంగళవారం  జరుగనుంది. ఈమ్యాచ్ తరువాత ఆతిథ్య జట్టు తో భారత్  రెండుటెస్టుల సిరీస్ లో తలపడనుంది.  దాంతో న్యూజిలాండ్ లో టీమిండియా సుదీర్ఘ పర్యటన ముగియనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: