ప్రత్యర్థి జట్టు ఎవరైనా చిత్తుగా ఓడిస్తు వరుస సిరీస్ను గెలుచుకుంటూ  తమకు ఎదురు లేదని నిరూపించుకుంటూ దూసుకుపోతుంది టీమిండియా. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు మొత్తం మరింత పటిష్టంగా మారీ  ప్రత్యర్థి జట్లను  బెంబేలెత్తిస్తున్నాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సిరీస్ను సొంతం చేసుకుని తమ సత్తా ఏంటో చాటుతుంది టీమిండియా జట్టు. ఇక మొన్నటికి మొన్న న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా స్వదేశంలోనే న్యూజిలాండ్ జట్టును ఐదు సున్నా తేడాతో చిత్తుచేసి క్లీన్స్వీప్ చేసి సంచలన రికార్డు సృష్టించింది. దీంతో టీమిండియా అభిమానులందరూ ఎంతో సంబరపడిపోయారు. 

 

 కానీ  టీమిండియా అభిమానుల సంబరం ఎక్కువ రోజులు నిలువలేదు అనే చెప్పాలి. ఎందుకంటే టీమిండియాతో జరిగిన ఐదు టీ-20 మ్యాచ్ల సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆతిధ్య  న్యూజిలాండ్ జట్టుకు గెలిచే అవకాశం ఇవ్వకుండా టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి ఐదు టి20 మ్యాచ్ లలో కూడా విజయాన్ని సాధించింది. మరోసారి కోహ్లీసేన కు తిరుగులేదు అని నిరూపించింది. కానీ ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం టీమ్ ఇండియా విఫలం అయిందని చెప్పాలి. స్వదేశంలో వన్డే సిరీస్ను గెలుచుకొని పరువు కాపాడుకోవాలని బరిలోకి దిగినది  న్యూజిలాండ్ జట్టు... కోహ్లీసేన కూడా విజయ ఉత్సాహంతో బరిలోకి దిగింది కానీ కోహ్లీసేన కంటే న్యూజిలాండ్ జట్టు పంతం నెగ్గించుకుంది. 

 


 వరుసగా రెండు వన్డే మ్యాచ్లలో ఓడిపోయిన కోహ్లీసేన సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు కట్టబెట్టింది. అయితే న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయిన టీమిండియా మరో చెత్త రికార్డును నమోదు చేసుకుంది. రెండో వన్డే మ్యాచ్లో ఓటమితో మొత్తంగా 423 వన్డే మ్యాచ్లో ఓటమి పాలైంది భారత్. దీంతో అత్యధికంగా వన్డే మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుగా ప్రథమ స్థానంలో నిలిచి చెత్త  రికార్డును నమోదు చేసింది టీమిండియా. ఇక భారత్ తర్వాత 421 లో ఓడిపోయే శ్రీలంక రెండో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ 413, వెస్టిండీస్ 378, న్యూజిలాండ్ 373 లతో వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో వన్డే మ్యాచ్ 11 న జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: